నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ‘అఖండ’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు పెద్ద సినిమాలన్నీ కూడా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశాయి. కానీ ‘అఖండ’ మాత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తో మిగిలిన సినిమాలన్నీ డేట్లు మార్చుకుంటున్నాయి. వాటిపై ఓ క్లారిటీ వస్తే తమ సినిమాను వదలడానికి చూస్తున్నారు బోయపాటి.
అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఇప్పటికే రెండు పెద్ద సినిమాలు దిగుతున్నాయి. మరొకటి కూడా ఉండే ఛాన్స్ ఉంది. జనవరి మిస్ చేస్తే మళ్లీ మార్చి, ఏప్రిల్ వరకు ఆగాలి. అప్పుడు కూడా పెద్ద సినిమాలున్నాయి. దీంతో క్రిస్మస్ సీజన్ బెటర్ అని భావిస్తున్నారు. అయితే ఇక్కడ విషయమేమిటంటే.. అదే సమయానికి నాని తన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
డిసెంబర్ 17న ‘పుష్ప’ ఎలానూ ఉంటుంది. ఒక వారం గ్యాప్ ఇచ్చి నాని తన సినిమాతో రావాలనుకున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య పోటీగా వస్తుండడంతో డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. కానీ నాని ఆ డేట్ ని మిస్ చేస్తే మళ్లీ సరైన డేట్ ఎప్పుడు దొరుకుంతుందో చెప్పలేం. అలా అని బాలయ్య సినిమాతో పాటు రిలీజ్ చేసి కలెక్షన్స్ షేర్ చేసుకోలేరు. మరి ఈ విషయంలో బాలయ్య, నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
This post was last modified on October 29, 2021 11:41 am
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…