ఇన్నాళ్లూ స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఈ మధ్యే ఐకాన్ స్టార్ అయిపోయాడు. సుకుమార్ ‘పుష్ప’కు సంబంధించిన ఒక ఈవెంట్లో ఏదో క్యాజువల్‌గా ‘ఐకాన్ స్టార్’ అన్నాడేమో అనుకుంటే.. దీని వెనుక ఒక ప్లానింగ్ ఉందని తర్వాత బన్నీ మాటలు, ఆయన మార్కు ప్రమోషన్లను బట్టి అర్థమైంది. సుకుమార్ ఆ మాట అన్నాక తనను ‘స్టైలిష్ స్టార్’ను చేసిన సుకుమారే ఇప్పుడు ‘ఐకాన్ స్టార్’ బిరుదు ఇచ్చారంటూ పర్టికులర్‌గా బన్నీ వ్యాఖ్యానించడం.. ఆ తర్వాతి రోజే తెలుగులోనే కాక వివిధ భాషలకు చెందిన పీఆర్వోలతో తన పేరు ముందు ‘ఐకాన్ స్టార్’ అన్న ట్యాగ్‌తో ‘పుష్ప’ గురించి ట్వీట్లు వేయించడం చూస్తే అతడి పీఆర్ ప్లానింగ్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది.
తాను ఏ సినిమా వేడుకకు వచ్చినా బన్నీ స్పీచ్ చాలా గట్టిగా ప్రిపేరై వస్తాడని.. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్‌తో దాని మీద సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగేలా, తన పేరు ట్రెండ్ అయ్యేలా చేస్తుంటాడని అతణ్ని గమనిస్తే స్పష్టమవుతుంది. ప్రతి విషయాన్నీ పీఆర్ కోణంలో చూడటం బన్నీ, అతడి టీంకు బాగా వంటబట్టేసినట్లే కనిపిస్తోంది ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తే.
తాజాగా ‘వరుడు కావలెను’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ.. అక్కడా తన ముద్రను చూపించాడు. ప్రసంగంలో ఒక చోట హిందీ చిత్రం ‘సూర్యవంశీ’ గురించి ప్రస్తావన తెచ్చాడు. బాలీవుడ్ ఈ సినిమాతోనే పూర్తి స్థాయిలో రీస్టార్ట్ అవుతుండటం.. మహారాష్ట్రలో కూడా థియేటర్లు తెరుచుకుంటుండటంతో పెద్ద ఎత్తున దీపావళికి విడుదలవుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిత్రానికి సౌత్ ఇండస్ట్రీ తరఫున బన్నీ విషెస్ చెప్పాడు. ఆ సినిమా బాగా ఆడాలని ఆకాంక్షించాడు.
బన్నీ ఇలా అన్నాడో లేదో.. కాసేపటికే కరణ్ జోహార్, రోహిత్ శెట్టి తదితర బాలీవుడ్ ప్రముఖులు అతడికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు వేసేశారు. బన్నీ ఏదో క్యాజువల్‌గా ఈ కామెంట్ చేసినట్లు అనిపించడం లేదు. అతనేదో ఒక చిన్న సినిమా వేడుకలో తెలుగులో ఒక కామెంట్ చేస్తే.. వెంటనే ‘సూర్యవంశీ’ టీం నుంచి పెద్ద పెద్ద వాళ్లు స్పందించి అతడికి థ్యాంక్స్ చెప్పడం, పొగడ్డం చూస్తే ఇది కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అనిపిస్తోంది.
బన్నీ ఇక్కడ ఆ సినిమా ప్రమోషన్‌కు సహకరించాడు కాబట్టి వాళ్లు బన్నీ గురించి ట్వీట్లు వేసి నార్త్‌లో అతడి పాపులారిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నట్లుంది. అలాగే రేప్పొద్దున ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానున్న నేపథ్యంలో బాలీవుడ్ జనాలు తన సినిమాను ప్రమోట్ చేయడం కోసం కూడా బన్నీ ‘సూర్యవంశీ’ ప్రస్తావన తెచ్చినట్లు భావిస్తున్నారు. మొత్తానికి బన్నీ పీఆర్ ప్లానింగ్ మామూలుగా ఉండదనడానికి ఇది తాజా రుజువు.
This post was last modified on October 29, 2021 7:45 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…