ఇప్పటిదాకా చూడని.. ఎప్పుడూ వినని కలయిక అంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి దాని బృందం సోషల్ మీడియాలో చేసిన ప్రకటన చూసి అందరూ తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఈ శుక్రవారమే దీని గురించి ప్రకటన రాబోతోందని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు ఏమిటీ కొలాబరేషన్ అంటూ గెస్సింగ్‌లో పడిపోయారు. ఈ సినిమాకు సంబంధించి దేశీయంగా అన్ని బిజినెస్ డీల్స్ పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత డీవీవీ దానయ్య లోకల్ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఉత్తరాదిన పెన్ మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి రానున్న ప్రకటన ఈ చిత్ర అంతర్జాతీయ హక్కులకు సంబంధించినదే అని సమాచారం.
ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో రిలీజ్ చేయబోతోందని.. దాని గురించే ప్రకటన రాబోతోందని టాలీవుడ్లో డిస్కషన్ నడుస్తోంది. వార్నర్ బ్రదర్స్ నిర్మించే హాలీవుడ్ సినిమాలను మన డిస్ట్రిబ్యూటర్లు ఇండియాలో రిలీజ్ చేయడమే చూశాం కానీ.. మన సినిమాలను ప్రపంచ స్థాయిలో వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేయడం గురించి ఎప్పుడూ ఊహ కూడా లేదు.
నిజంగా ఈ ప్రచారం నిజమే అయితే మాత్రం మన రాజమౌళి మరిన్ని మెట్లు పైకి ఎక్కేసినట్లే. ఇండియన్ సినిమాను కూడా కొన్ని మెట్లు ఎక్కించినట్లే. ‘బాహుబలి’ బ్రాండ్ ‘ఆర్ఆర్ఆర్’కు బాగానే ఉపయోగపడుతోందనడానికి ఇది రుజువు. ‘బాహుబలి’ వివిధ దేశాల్లో చాలా బాగా ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు చర్చనీయాంశం అయ్యేలా చేసింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు ఈ స్థాయి క్రేజ్, బిజినెస్ డీల్స్ వస్తున్నాయన్నా అది రాజమౌళి క్రెడిటే.
This post was last modified on October 29, 2021 7:40 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…