రెండేళ్ల ముందు వరకు టొవినో థామస్ అంటే ఎవరో తెలుగు ప్రేక్షకులకు అస్సలు తెలియదు. ఇతను మలయాళంలో స్టార్ హీరో. ఐతే మలయాళ సినిమాల పేరెత్తితే మన వాళ్లకు మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి అగ్ర హీరోలే గుర్తుకొస్తారు. వాళ్లు కాకుండా యంగ్ హీరోల్లో పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ లాంటి వాళ్లు కొంత పాపులర్.
కానీ టొవినో థామస్ మాత్రం మన జనాలకు పెద్దగా తెలియదు. కానీ ‘ఆహా’ ఓటీటీ పుణ్యమా అని మన తెలుగు జనాల్లో టొవినో బాగా పాపులర్ అయిపోయాడు. గత ఏడాది కరోనా టైంలో మొదలై, చాలా వేగంగా తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ సంపాదించిన ‘ఆహా’ మొదట్లో భారీ పెట్టుబడులేమీ పెట్లలేదు.
గీతా ఆర్ట్స్ సొంత సినిమాలకు తోడు కొన్ని చిత్రాలను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. వాటికి తోడు మలయాళంలో వచ్చిన మంచి సినిమాలన్నింటినీ పట్టుకొచ్చి అనువాదం చేసి రిలీజ్ చేశారు. ఇలా పదుల సంఖ్యలో సినిమాలు ఆహాలో స్ట్రీమ్ అయ్యాయి. అందులో మెజారిటీ సినిమాలు టొవినోవే కావడం విశేషం.
ఆహా ద్వారా అతడి సినిమాలకు బాగా అలవాటు పడి తన మీద అభిమానం పెంచుకున్నారు జనాలు. ఆ మధ్య అతడికి ఓ ప్రమాదం జరిగితే మన వాళ్లు చాలా కంగారు పడిపోయారు. ఇప్పుడు టొవినో నుంచి కొత్తగా రిలీజయ్యే ప్రతి సినిమా మీదా మన వాళ్ల దృష్టి పడుతోంది. తాజాగా టొవినో ‘మిన్నల్ మురళి’ అనే వెరైటీ సినిమా చేశాడు. మిన్నల్ అంటే మెరుపు అని అర్థం. ఆకాశం నుంచి వచ్చే ఒక మెరుపు వల్ల అతీంద్రయ శక్తులు సంపాదించి సూపర్ మ్యాన్ తరహా విన్యాసాలు చేసే కుర్రాడిగా ఇందులో నటించాడు టొవినో.
దీని ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న సినిమా అన్ని భాషల వాళ్లనూ ఆకర్షిస్తోంది. థియేటర్లలో రిలీజైతే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేలా కనిపిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. కాకపోతే అన్ని భాషలకూ ‘మిన్నల్ మురళి’ అనే టైటిల్ పెట్టారు. తెలుగులో ‘మెరుపు మురళి’ అని పెట్టడానికి వచ్చిన ఇబ్బందేంటో అర్థం కాదు.
This post was last modified on October 28, 2021 3:27 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…