టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ ‘మొహంజదారో’ సినిమా రూపంలో ఆమెకి పెద్ద డిజాస్టర్ ఎదురైంది. ఆ తరువాత తెలుగులో ‘డీజే’ సినిమాలో నటించి.. ఓ రేంజ్ లో గ్లామర్ ఎక్స్ పోజ్ చేసి తొలి హిట్టు అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత పూజాహెగ్డే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస హిట్స్ తో బిజీ స్టార్ గా మారింది.
సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా.. అందరిలానే పూజాకి కూడా సొంతింటి కల ఉంది. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకునే పనిలో పడింది. ముంబైలో ఓ పోష్ ఏరియాలో ఇల్లు కొనుక్కుంది పూజాహెగ్డే. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. పెయింటింగ్ వర్క్స్ ను పరిశీలిస్తూ కొన్ని ఫోటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.
ఈ ఫోటోలకు ‘బిల్డింగ్ మై డ్రీమ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ఇంటి పనులను తనకంటే తన తల్లి ఎక్కువగా చూసుకుంటుందని పూజా చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియాకు చెందిన పూజాహెగ్డే ఫ్యామిలీ వృత్తిరీత్యా ముంబైలో సెటిల్ అయింది. ఇప్పుడు మన బుట్టబొమ్మ తన కోసం తన ఫ్యామిలీ కోసం ఓ లావిష్ ఇంటిని రెడీ చేస్తోంది. త్వరలోనే వీరంతా కొత్తింట్లోకి షిఫ్ట్ కానున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తమిళంలో ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.
This post was last modified on October 27, 2021 8:42 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…