వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలన్నీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరిలో వస్తుండడంతో దానికి పోటీగా సినిమాలను రిలీజ్ చేయాలనుకోవడం లేదు. అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేసిన ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’ సినిమాలను కూడా వాయిదా వేయబోతున్నారు. ఈ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’కి పోటీగా నాగార్జున తన ‘బంగార్రాజు’ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.
‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకి ప్రీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాను లాంఛ్ చేశారు. అయినప్పటికీ.. నవంబర్ నాటికి సినిమాను పూర్తి చేసి.. డిసెంబర్ చివరికి ఫస్ట్ కాపీను రెడీ చేసేయాలనేది ప్లాన్. దీంతో కచ్చితంగా సంక్రాంతి బరిలో నిలుస్తామంటూ ఫీలర్లు వదులుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలే రేసు నుంచి తప్పుకుంటుంటే.. నాగార్జున మాత్రం పోటీకి సై అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధేశ్యామ్’ కూడా రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య అసలు ‘బంగార్రాజు’ నిలవగలడా..? అండ్ సందేహాలు కలుగుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. నాగార్జున చెబుతున్నట్లు డిసెంబర్ నాటికి సినిమా ఫస్ట్ కాపీని రెడీ చేయగలరా..? అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. భారీ సెట్స్ కూడా ఉంటాయి. అవన్నీ రెండు నెలల్లో పూర్తిచేయడం కష్టమే. అయినప్పటికీ.. నాగార్జున మాత్రం సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారట.
This post was last modified on October 27, 2021 6:48 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…