Movie News

ఐయామ్ ప్రభాస్.. ఫ్రమ్ మొగల్తూరు

ప్రభాస్‌లో అందరికీ నచ్చే గుణం.. అతడి అణకువే. కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నాడో.. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాక కూడా అతను అలాగే ఉన్నాడు. ఎలాంటి దర్పం, గర్వం చూపించకుండా ఇప్పటికీ చాలా హంబుల్‌గా కనిపిస్తుంటాడతను.

సోషల్ మీడియా ప్రభాస్ అభిమానులు అతి చేస్తుంటారు కానీ.. అతను మాత్రం తన రేంజ్ పెరిగిపోయిందని, తాను గొప్ప అనే విధంగా ప్రవర్తించడు. మామూలు వ్యక్తిలాగే మాట్లాడతాడు. అవతలి వాళ్ల స్థాయి చూడకుండా వారితో క్యాజువల్‌గా ఉంటాడు.

తాను మిడ్ రేంజ్ హీరోగా ఉన్నపుడు.. తన స్టేటస్‌ను పక్కన పెట్టి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే ప్రభాస్‌కు చాలా ఇష్టం. ఆ రెండు చిత్రాలూ అనుకున్నంతగా ఆడకపోయినా.. నటుడిగా తన ఎదుగుదలకు తోడ్పడటం.. తన కెరీర్లో అవి భిన్నమైన చిత్రాలుగా నిలవడంతో పూరి మీద ప్రత్యేక అభిమానం ఉంది ప్రభాస్‌కు.

ఆ అభిమానంతోనే పూరి కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు ప్రభాస్. ముంబయిలో షూటింగ్‌లో బిజీగా ఉన్న అతను.. ‘రొమాంటిక్’ కోసం బ్రేక్ తీసుకుని ఒక రోజు మొత్తాన్ని కేటాయించాడు. తన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడమే కాదు.. హీరో హీరోయిన్లు ఆకాశ్, కేతిక శర్మలతో ఒక చిట్ చాట్ కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు.
అందులో ‘రొమాంటిక్’ సినిమా గురించి తనే వాళ్లిద్దరినీ ఇంటర్వ్యూ కూడా చేశాడు. చాలా సరదాగా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూలో ఒక చోట కేతిక శర్మ తనను తాను ప్రభాస్‌కు పరిచయం చేసుకుంది. హాయ్ సర్ ఐయామ్ కేతిక ఫ్రమ్ న్యూ ఢిల్లీ అంది. దీనికి ప్రభాస్ బదులిస్తూ.. ‘హాయ్ మేడమ్.. ఐయామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూరు’ అనడం ఈ వీడియోకు హైలైట్.

ప్రభాస్ స్థాయి వ్యక్తి ఇలా అనడం అందరినీ ఆకట్టుకుంది. దానికి బదులుగా కేతిక షాకై.. మీరు బాహుబలి సర్, మీ గురించి మీరు పరిచయం చేసుకోవడం ఏంటి.. మీరు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అంటూ ఇబ్బంది పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్‌ను అందరూ డార్లింగ్ అనేది ఇందుకే అంటూ అతన్ని పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.

This post was last modified on October 27, 2021 3:35 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago