ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల పరిస్థితి ఇలా సంక్షోభంలో పడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సంవత్సరాలు గడిచేకొద్దీ ఏ వస్తువుల ధరలైనా పెరగడం మామూలే. అందులోనూ గత రెండేళ్లలో అన్ని ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. కానీ సినిమా టికెట్ల రేట్ల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. ఏపీలో దశాబ్దం కిందటి రేట్లను తిరిగి అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్కారు తెలుగు సినీ పరిశ్రమను ఒక రకమైన సంక్షోభంలోకి నెట్టింది.
ఇదంతా జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసే క్రమంలో మొదలైన ఇష్యూ అన్న సంగతే అని అందరికీ తెలుసు. ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి అహం అడ్డొచ్చినట్లుగా కనిపిస్తోంది. టికెట్ల ధరలు రివైజ్ చేయడానికి ఏపీ సర్కారు ఒక దశలో సిద్ధమైనప్పటికీ.. ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ వీర లెవెల్లో ఏపీ సర్కారును ఈ విషయమై దునుమాడంతో ప్రభుత్వ పెద్దల ఇగో ఇంకా పెరిగినట్లే కనిపిస్తోంది.
టికెట్ల ధరల్లో మార్పులకు సంబంధించి జీవో ఇదిగో అదిగో వచ్చేస్తుంది అనుకుంటూనే నెలలు నెలలు గడిచిపోయాయి. ముందు దసరాపై ఆశలు పెట్టుకున్నారు. తర్వాత క్రిస్మస్.. ఆపై సంక్రాంతి అంటూ ఊహాగానాల్లోకి వెళ్లారు. చివరికి చూస్తే వేసవి వరకు ఆశల్లేవని అంటున్నారు. ప్రభుత్వం తరఫున తేనున్న ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక కానీ టికెట్ల ధరలు మారవు అంటున్నారు. అంటే క్రిస్మస్ టైంలో, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ కానున్న భారీ చిత్రాలకు గట్టి దెబ్బ తప్పదన్నమాట.
గత రెండు మూడు నెలల్లో రిలీజైన సినిమాల్లో ఏవీ కూడా ఏపీలో సరైన బిజినెస్ చేయలేకపోయాయి. తెలంగాణలో మంచి లాభాలు తెచ్చిపెట్టిన ‘లవ్ స్టోరి’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలకు కూడా ఏపీలో నష్టాలు తప్పలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి వివిధ సినిమాల బిజినెస్ డీల్స్‌ను రివైజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘ఆర్ఆర్ఆర్’లో విషయంలోనూ అదే జరిగింది. మొత్తానికి ఈ పరిస్థితి మొత్తం టాలీవుడ్‌కు శిరోభారంగా మారింది.
టికెట్ల రేట్ల విషయంలో తమ న్యాయమైన డిమాండ్ల గురించి ప్రభుత్వాన్ని గట్టిగా అడగాల్సి ఉన్నా ఎవ్వరూ నోరు విప్పే పరిస్థితి లేదు. పవన్‌లా ఎవరికీ గట్టిగా అఢిగే ధైర్యం లేదు. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి గట్టిగా డిమాండ్ చేస్తే ప్రభుత్వం కంగారు పడుతుందేమో. కానీ బతిమాలుకుని తప్ప ఇలాంటివి సాధించలేమన్న ఆలోచనలోనే అందరూ కనిపిస్తున్నారు. దీంతో జగన్ సర్కారు ఈ విషయంలో చాలా తాపీగా కనిపిస్తోంది. వినోదం చూస్తోంది.
This post was last modified on October 26, 2021 12:55 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…