బాలీవుడ్ లో సమంత పబ్లిసిటీ!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇక్కడే సెటిల్ అవుదామనుకున్నారు. సౌత్ సినిమాల్లో నటించిందే తప్ప బాలీవుడ్ కి ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ఆమెకి నేషనల్ వైడ్ గా గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ సమయంలో సామ్ ని వెతుక్కుంటూ బాలీవుడ్ ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ సమంత మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు తన దృష్టి బాలీవుడ్ పై పడింది.

ఎప్పుడైతే తన భర్త నాగచైతన్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారో.. అప్పటినుంచి ఆమె బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. చాలా నెలల క్రితమే సమంత ముంబైలో ఓ పీఆర్ ఏజెన్సీను నియమించుకున్నారు. తనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా పబ్లిష్ అయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు సమంత. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా చాలా మంది కోసం ముంబై పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.

ఇప్పుడు సమంత కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడింది. ఇంతకముందు ఆమె కార్పొరేట్ బ్రాండ్స్ ను పొందడానికి నేషనల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తెగ ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆ పబ్లిసిటీ పనులు బాగానే జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.