మహేష్ ఫాన్స్ ఎదురు చూస్తోన్న సినిమా ఇదే!

పోకిరి తర్వాత మహేష్ అలంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. బిజినెస్ మాన్ లో ఆ ఆటిట్యూడ్ కాస్త చూపించినా కానీ మళ్ళీ పోకిరి రాణి వెలితి అయితే అలా ఉండిపోయింది. ఇప్పుడు పరశురామ్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మళ్ళీ పోకిరిలో మహేష్ ని చూడవచ్చునట. పూరి జగన్నాధ్ శిష్యుడైన పరశురామ్ తన శైలికి భిన్నంగా ఫామిలీ సినిమాలు చేస్తూ వచ్చాడు.పెద్ద స్టార్ తో వర్క్ చేయాలనే అతని కల ఇప్పటికి నెరవేరింది.

ఈ అవకాశాన్ని ఎలా అయినా కౌంట్ అయ్యేట్టు చేయాలని పరశురామ్ కసిగా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ గెటప్ ఎలా ఉంటుందనే దానిపై హింట్ ఇచ్చి ఫాన్స్ ని ఉర్రూతలూగించాడు. ఇందులో మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చాలా బాగుంటాయని ఇన్సైడ్ సమాచారం. పరశురామ్ చెప్పిన క్యారెక్టర్ శైలి బాగా నచ్చడంతో మహేష్ మరో ఆలోచన లేకుండా ఈ కథ ఓకే చేసి మిగతావన్నీ వాయిదా వేసాడు. షూటింగ్స్ మళ్ళీ మామూలుగా జరుగుతున్న టైంకి సర్కారు వారి పాట కూడా స్టార్ట్ అవుతుంది.