పూరి జగన్నాథ్ ఎలాంటి స్థితిలోనూ తొణకని వ్యక్తి లాగే కనిపిస్తుంటాడు. ఒక టైంలో తాను నమ్మిన వ్యక్తి ఆర్థికంగా తనను ముంచేస్తే.. ఆ స్థితిలోనూ చాలా దృఢంగా నిలబడ్డాడు పూరి. ఆ టైంలో మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ చాలా మామూలుగానే కనిపించాడు.
దర్శకుడు కావడానికి ముందు, తర్వాత ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకుని నిలబడ్డం వల్ల వచ్చిన స్థిరత్వం వల్ల కావచ్చు పూరి ఎప్పుడూ పెద్దగా ఎమోషనల్ అయినట్లు కనిపించాడు. అలాంటి వాడు మొన్న ‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన కొడుకు ఆకాశ్ చాలా ఉద్వేగభరితంగా మాట్లడుతుంటే.. పూరి కొంచెం కదిలిపోయాడు.
ఆయన కళ్లల్లో సన్నని కన్నీటి ధార కనిపించింది. ఎంతటి వారైనా సరే.. తమ బిడ్డల విషయంలో ఎమోషనల్ అయిపోతారనేందుకు పూరి రుజువుగా కనిపించాడు ఆ రోజు. కాగా ‘రొమాంటిక్’ సినిమా ఫస్ట్ కాపీ చూసినపుడు కూడా పూరి ఇంతే ఎమోషనల్ అయ్యాడట.
సినిమా మొత్తం చూసి బయటికి వచ్చాక పూరి తన ముందు ఏడ్చేసినట్లు దర్శకుడు అనిల్ పాడూరి తెలిపాడు. ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి’ తర్వాత తన కెరీర్లో అత్యంత ఎమోషన్ ఉన్న సినిమానే అని.. సినిమా చాలా బాగా తీశావని పూరి తనను అభినందించినట్లు అనిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘రొమాంటిక్’ సక్సెస్ పట్ల పూరి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు అనిల్ వెల్లడించాడు.
పూరి స్క్రిప్టుతో తెరకెక్కిన సినిమా కాబట్టి కచ్చితంగా ఇందులో ఆయన శైలి కనిపిస్తుందని.. తాను కాకుండా ఎవరు తీసినా అలాగే జరుగుతుందని అనిల్ అన్నాడు. తాను కళ్యాణ్ రామ్‌తో కలిసి పదేళ్ల కిందటే ఒక విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను మొదలుపెట్టి దాన్ని విజయవంతంగా నడుపుతున్నానని.. పూరితో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని.. తన రైటింగ్ నచ్చి, తాను రాసిన‘రొమాంటిక్’ కథను తనకు ఇచ్చి డైరెక్ట్ చేయమన్నాడని.. ఆయన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెడతానని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on October 25, 2021 6:00 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…