పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ఇప్పుడు మార్చి నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరిలో వస్తుండడంతో పవన్ సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాపై అమెజాన్ కన్నేసింది.
సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా నేరుగా డిజిటల్ లో రిలీజ్ చేస్తే మంచి రేటు ఇస్తామని నిర్మాతలను టెంప్ట్ చేస్తున్నారు అమెజాన్ నిర్వాహకులు. దాదాపు రూ.140 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక సౌత్ సినిమాకి ఈ రేంజ్ లో ఆఫర్ ఇవ్వడమనేది ఇది మొదటిసారి. ఒక్క డిజిటల్ హక్కుల కోసమే రూ.140 కోట్ల ఆఫర్ వచ్చిందంటే పవన్ సినిమాకి ఉన్న డిమాండ్ ఏంటో అర్ధమవుతోంది.
ఇది కాకుండా శాటిలైట్, హిందీ రైట్స్, ఆడియో రైట్స్ ఎలానూ ఉంటాయి. అయితే ఈ ఆఫర్ ను నిర్మాతలు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ లేదనిపిస్తుంది. మొన్నామధ్య పవన్ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని రూమర్లు వచ్చినప్పుడు కూడా నిర్మాణ సంస్థ వెంటనే స్పందిస్తూ.. తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తామని అన్నారు. పవన్ మాత్రం రిలీజ్ విషయం నిర్మాతలకు వదిలేశారట. ఎలా లాభమనిపిస్తే అలానే రిలీజ్ చేసుకోమని చెప్పేశారట.
ఏపీలో టికెట్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. ఆ లెక్కన చూసుకుంటే పవన్ సినిమాకి అమెజాన్ మంచి రేటు కట్టిందనే చెప్పాలి. కానీ పవన్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాను ఓటీటీకి ఇస్తే ఫ్యాన్స్ ఊరుకునే ప్రసక్తే ఉండదు. కాబట్టి లాభాలు వచ్చినా.. లేకపోయినా నిర్మాతలు మాత్రం సినిమాను థియేటర్లోనే విడుదల చేయాల్సిన పరిస్థితి.
This post was last modified on October 25, 2021 2:38 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…