Movie News

ఇంట్లో వాళ్ల కంటే దీప్తికే ఎక్కువ భయపడతాడట

వారం మొత్తం ఒకలా.. వారం చివర్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ.. ఈ ప్రోగ్రాం మీద మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది బిగ్ బాస్ తెలుగు వెర్షన్. ఆదివారం ముగిసిన ఎపిసోడ్ తో బిగ్ బాస్ తాజా సీజన్ లో యాభై రోజులు ఇట్టే గడిచిపోయాయి. తాజా ఎపిసోడ్ లో ప్రియను షాకింగ్ రీతిలో తొలగించటం అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. తీవ్రమైన భావద్వేగాన్ని మిగిల్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరన్న విషయాన్ని చెప్పకుండా.. ప్రియ.. యానీ మాస్టర్ ఇద్దరిని బాక్సులో ఉంచేయటం.. ఇంటి సభ్యుల్లో టెన్షన్ పుట్టించేలా చేశారు.

నిజానికి ఇంటి సభ్యులు , ఈ రియాల్టీ షోను చూస్తున్న వారు సైతం థ్రిల్ కు గురయ్యారు. అదే సమయంలో ఇంటిని వీడిపోతున్న వారి గురించి తలుచుకుంటూ పెద్ద ఎత్తున భావోద్వేగానికి గురి కావటం.. ఏడ్చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా ఎలిమినేట్ అయిన ప్రియకు బయటకు వెళ్లే వేళలో ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు.

అందులో ఇంట్లో ఉన్న సభ్యులకు మార్కులు ఇవ్వాలని కోరితే.. తనకు బాగా దగ్గరైన ప్రియాంకకు మాత్రం పదికి వంద మార్కులు వేయగా.. యానీ మాస్టర్ కు పదికి పది మార్కులు వేశారు. విశ్వకు ఐదు మార్కులకే పరిమితం చేసింది.ఇలా మార్కులు ఇచ్చే క్రమంలో షణ్ముఖ్కు 8.5 మార్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా షణ్ణు గురించి మాట్లాడుతూ.. ‘నీ గర్ల్ ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని అడగ్గా.. ‘ఈ మాట చాలు’ అంటూ షణ్ముఖ్ సమాధానం ఇచ్చాడు.

ఈ క్రమంలో ప్రియ కలుగజేసుకొని.. నిన్ని మర్చిపోయి బిగ్ బాస్ హౌస్ లో హాయిగా ఉన్నాడని తాను చెబుతానని ప్రియా చెప్పటంతో వణికిపోయాడు షణ్ముఖ్. వెంటనే విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తూ.. తనకు అలా చెప్పొద్దని దండం పెట్టాడు. అంతేకాదు.. దీప్తికి తాను ఎక్కువగా భయపడతానని.. ఇంట్లో వారంటే కూడా భయం లేదని.. దీప్తి అంటే మాత్రం తనకు భయమని చెప్పాడు. దీంతో.. షణ్ముఖ్ మాట ఆసక్తికరంగా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ గురించి మాట్లాడిన ప్రియా.. అతనో వండర్ ఫుల్ పర్సన్ అని.. అతను బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నట్లుగా మెచ్చుకున్నారు. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని షణ్ణును పొగిడేశారు.

This post was last modified on October 25, 2021 2:15 pm

Share
Show comments

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

5 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago