ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న ‘రొమాంటిక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు అనిల్ పాదూరి. దాదాపు పదేళ్లకు పైగా వీఎఫ్ఎక్స్ రంగంలో అనుభవం ఉన్న అనిల్ పాదూరికి దర్శకత్వం వైపు మనసు లాగడానికి కారణం పూరి జగన్నాద్ అనే చెప్పాలి. తను రాసేవి పూరి జగన్నాద్ కి బాగా నచ్చేవని అనిల్ అన్నారు. ‘ఇజం’ సినిమా సమయంలోనే ఓ కథను డైరెక్ట్ చేయమని పూరి చెబితే.. నమ్మకం లేక ఒప్పుకోలేదని.. ఇప్పుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నట్లు చెప్పారు అనిల్.
ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ రాయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు పూరి. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ చూస్తుంటే పూరి జగన్నాద్ మార్క్ కనిపిస్తోంది. కథ-మాటలు పూరి గారివే అయినప్పటికీ ఈ సినిమాలో డైరెక్టర్ గా తన మార్క్ ఉంటుందని చెబుతున్నారు అనిల్. సినిమా చూస్తే పూరిగారు తీసినట్లుగా ఉండదని అన్నారు. ఈ సినిమా చూసిన పూరిగారు నా కథలో ఇంత ఎమోషన్ ఉందా..? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు.
ట్రైలర్ చూసిన ఇది యూత్ సినిమా అనుకోవద్దని.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటుందని అన్నారు. పూరి డైరెక్ట్ చేసిన ‘టెంపర్’ సినిమాకి అనిల్ పాదూరి వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ సోదరుడు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి అనిల్ ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీను మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో దర్శకుడిగా పరిచయం కావాలని అనుకున్నారు అనిల్. కానీ వీఎఫ్ఎక్స్ పనులతో బిజీగా ఉండడంతో కుదరలేదు. ఆ తరువాత ‘రొమాంటిక్’ సినిమా ఆఫర్ వచ్చింది. ఇప్పుడు దర్శకుడిగా తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే చేస్తానని స్పష్టం చేశారు అనిల్ పాదూరి.
This post was last modified on October 24, 2021 9:39 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…