Movie News

ప్రగ్యా.. ఇది తప్పు కదా!

ప్రగ్యా జైశ్వాల్ అనే అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘కంచె’ మూవీతో. విలక్షణ దర్శకుడు క్రిష్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనదగ్గ ఈ మూవీలో కథానాయిక పాత్రలో ప్రగ్యా ఆశ్చర్యకర నటనను ప్రదర్శించింది. అందంతోనూ ఆకట్టుకుంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న ఓ అమ్మాయి అంత కాన్ఫిడెంట్‌గా ఆ పాత్రను పోషించడం ఆశ్చర్యపరిచింది.

ఆ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది ప్రగ్యా. ఈ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రగ్యా కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేసింది.

ఐతే ఆమె నేపథ్యం తెలిసిన వాళ్లకు తన ట్వీట్ నోరెళ్లబెట్టేలా చేసింది. ‘తొలి’ విషయాలు ఎప్పుడూ ప్రత్యేకం అని ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. అంటే.. ‘కంచె’ కథానాయికగా తన తొలి చిత్రం అనే సంకేతాన్ని ప్రగ్యా ఇచ్చిందన్నమాట.

కానీ నిజానికి ప్రగ్యాకు ‘కంచె’ తొలి చిత్రం కాదు. కనీసం తెలుగులో ఆమెకిది తొలి సినిమానా అంటే అది కూడా కాదు. తెలుగులో ఆమె అప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ‘డేగ’ ఆమె తొలి చిత్రం కాగా.. గత ఏడాది బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచిన అభిజిత్ కథానాయకుడిగా నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే మరో సినిమాలోనూ ప్రగ్యా కథానాయికగా నటించింది.

ఐతే ఈ రెండు చిత్రాలు అంతగా ఆడలేదు. జనాల దృష్టిలో పడలేదు. అప్పుడే క్రిష్.. ప్రగ్యాకు ‘కంచె’లో అవకాశం ఇచ్చాడు. తన కెరీర్లో మరిచిపోలేని పాత్ర, సినిమాను అందించాడు. ఆ తర్వాత ప్రగ్యా ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.

ప్రగ్యాకు గుర్తింపు తెచ్చింది ‘కంచె’నే కావచ్చు కానీ.. అంతకుముందు చేసిన సినిమాలను చరిత్రలో కలిపేయాలని చూడటమే ఆశ్చర్యం. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే.. ‘కంచె’ సినిమాకు ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్ అవార్డిస్తే ప్రగ్యా ఇది తన డెబ్యూ మూవీ కాదని చెప్పకుండా ఆ అవార్డును తీసేసుకుంది.

This post was last modified on October 23, 2021 2:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

2 hours ago

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

7 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

8 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

9 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

10 hours ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

11 hours ago