దర్శకుడు పూరి జగన్నాథ్ డైలాగ్స్ థియేటర్లో వినిపిస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తుంటాయి. ఒక్కో డైలాగ్.. డైనమైట్ లా పేలుతుంటుంది. ఈ జెనరేషన్ వాళ్లకి పూరి మాటలు నేరుగా టచ్ అవుతుంటాయి.
అయితే ఈ విషయంలో పూరీని మించిపోయాడు ఆయన కొడుకు ఆకాష్ పూరి. తను నటించి ‘రొమాంటిక్’ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆకాష్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
ఆకాష్ స్టేజ్ పై మాట్లాడుతుంటే.. పూరి కూడా ఆశ్చర్యపోతూ.. ఎంతో సంతోషంగా కనిపించారు. తన తండ్రిలానే ఓ చిన్న పిట్టకథతో స్పీచ్ మొదలుపెట్టాడు ఆకాష్. ఒక రాంగ్ పర్సన్ ని నమ్మడం వలన తన తండ్రి ఇబ్బందిపడ్డారని.. ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తుచేసుకున్నారు. తన తండ్రిని ఎవరైనా కామెంట్ చేస్తే.. వాడి ఇంటికి వెళ్లి తల పగలగొట్టాలనిపించేదని చెప్పి తండ్రిపై తన ప్రేమను చాటుకున్నాడు.
చాలా మంది తన తండ్రిని ఉద్దేశిస్తూ.. ‘పూరి పనైపోయింది.. ఇక వీడేం సినిమాలు చేస్తాడు.. అన్నీ రొటీన్ సినిమాలు చేసుకుంటాడు’ అని అన్నారని.. వారందరికీ ‘ఇస్మార్ట్ శంకర్’తో సమాధానం చెప్పాడని.. ఆ సినిమా చూసిన కాలర్ ఎగరేశానని ఆకాష్ గర్వంగా చెప్పుకొచ్చాడు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాడు హిట్ కొడితే.. గుర్తింపు వస్తుందని.. ప్లాప్ వస్తే ఎవరూ పట్టించుకోరని చెప్పిన ఆకాష్.. తను మాత్రం తన తండ్రి అండతో వచ్చానని, హిట్ కొట్టకపోతే కనీసం మనిషిలా కూడా చూడరని అన్నాడు. ఎప్పటికైనా మా నాన్న కాలర్ ఎగరేసే హీరో అవుతానని ఎంతో నమ్మకంగా చెప్పాడు ఆకాష్. అతడు స్టేజ్ పై మాట్లాడుతున్నంతసేపు కూడా స్టేడియంలో అరుపులే అరుపులు. పూరిలో కనిపించే ఆ ఫైర్ ఆకాష్ కూడా కనిపించింది. పూరికి అప్ గ్రేడెడ్ వెర్షన్ లా కనిపించాడు ఆకాష్. పూరికి ఆకాష్ రూపంలో మంచి డైలాగ్ రైటర్ దొరికాడనే చెప్పాలి.
This post was last modified on October 23, 2021 11:56 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…