సెలబ్రిటీల ఇళ్లల్లో పని చేసే వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అన్న సందేహం కలుగుతుంది. యజమాని సంబంధం కాకుండా మానవీయ సంబంధాలు నెరపే వారు తక్కువే. ఎవరో కొందరే తమతో పాటు.. తమ కుటుంబంగా వారిని చూసుకుంటూ ఉంటారు.
ఈ మాటకు బలం చేకూరేలా రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీలో జరిగిన ఒక కార్యక్రమం చెప్పేస్తుంది. తమ ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్న మహిళకు రెబల్ స్టార్ ఇంటి సభ్యులు ఊహించని కానుకను అందించారు.
తమ ఇంట్లో పాతికేళ్లుగా పని చేస్తున్న మహిళకు.. పాతికేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఒక అందమైన కేక్ ను కట్ చేయించి ఆమెను సంతోషపెట్టారు. ఒక బహుమతిని కూడా అందించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాల్ని రాధేశ్యామ్ నిర్మాత కమ్ రెబల్ స్టార్ కుమార్తె ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
పాతికేళ్లుగా తమ కోసం చాలా చేశారంటూ.. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ పెట్టిన పోస్టు.. దానికి జత చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రెబల్ స్టార్ ఇంట్లో పని చేసే వారిని.. తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేయటాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. దీంతో పాటు ఆమెకు కృష్ణం రాజు సతీమణి బంగారు గొలుసును బహుమతిగా అందజేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
నిజమే కదా… 25 సంవత్సరాలు అంటూ మోర్ దాన్ ఎ జనరేషన్. ఒక జీవితం తమ కుటుంబానికి అంకితం చేసినందుకు ఆమెకు తగిన గౌరవం ఇవ్వడం… కృష్ణంరాజు కుటుంబం మానవీయత.
This post was last modified on October 23, 2021 11:46 am
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…