‘బొమ్మరిల్లు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు భాస్కర్ ఆ తరువాత ‘ఒంగోలు గిత్త’, ‘ఆరెంజ్’ లాంటి సినిమాలు తీశారు. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత తమిళంలో ఓ సినిమా చేశారు. అదీ పెద్దగా ఆడలేదు. దీంతో అతడికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. చాలా కాలం తరువాత బొమ్మరిల్లు భాస్కర్ కి ఓ ఛాన్స్ వచ్చింది. అదే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
నిజానికి భాస్కర్ తీసిన సినిమా నిర్మాతలకు నచ్చలేదట. దీంతో చాలా సీన్లను రీషూట్ చేయించారు. ఆ తరువాత అక్కినేని నాగార్జున ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కొన్ని మార్పులు చెప్పారు. అలా రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం సాగింది. నిర్మాతలు, నాగార్జున చేసిన మార్పులు, చేర్పుల వలనే సినిమా ఆడిందని అంటున్నారు. అందుకే ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్.. దర్శకుడు భాస్కర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
సినిమా మేకింగ్ విషయంలో భాస్కర్ ని బాగా ఇబ్బంది పెట్టమని.. కానీ అనుకున్నది సాధించాడు అంటూ బన్నీ కామెంట్స్ చేశారు. పరోక్షంగా రీషూట్ల గురించే చెప్పారు బన్నీ. ఇప్పుడు భాస్కర్ పై నమ్మకంతో గీతాఆర్ట్స్ సంస్థ మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ హీరోకి సెట్ అయ్యే కథని రెడీ చేసుకోమని చెప్పిందట గీతాఆర్ట్స్ సంస్థ. మొత్తానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ తో భాస్కర్ మరో ఛాన్స్ కొట్టేశాడనే చెప్పాలి. మరి ఈసారి ఎలాంటి కథను రెడీ చేసుకుంటారో చూడాలి!
This post was last modified on October 22, 2021 2:04 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…