తండ్రి సినిమాలో కొడుకు, కొడుకు సినిమాలో తండ్రి గెస్ట్‌గా నటిస్తే వచ్చే కిక్కే వేరు. రామ్ చరణ్, చిరంజీవి విషయంలో ఆ కిక్‌ని ఎంజాయ్ చేశారు మెగా ఫ్యాన్స్. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ల ‘మనం’ కూడా అక్కినేని ఫ్యాన్స్‌కి ఆ సంతోషాన్ని పంచింది. ఇప్పుడు వారికి మరోసారి ఆ ట్రీట్ దక్కబోతోంది.
ఆల్రెడీ ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటిస్తున్నాడు. అలాగే నాగార్జున ‘బంగార్రాజు’లో నాగచైతన్య యాక్ట్ చేస్తున్నాడు. త్వరలో అఖిల్ కూడా తన డాడ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నాగ్‌తో ప్రవీణ్ సత్తారు తీస్తున్న ‘ద ఘోస్ట్’ మూవీలో అఖిల్ అతిథి పాత్రలో కనిపిస్తాడట. కొద్ది నిమిషాల పాత్రే అయినప్పటికీ కథకు చాలా ఇంపార్టెంట్ రోల్ అట. దానికి అఖిల్ అయితే పర్‌ఫెక్ట్ అని ప్రవీణ్ డిసైడయ్యాడని, నాగ్‌తో పాటు అఖిల్ కూడా ఓకే అన్నాడని సమాచారం.
విశేషమేమిటంటే.. ఈ మూవీలో నాగ్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించబోతున్నారు. అఖిల్ కూడా ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఒకవేళ ప్రొఫెషనల్‌గా నాగ్‌కి హెల్ప్ చేసే మరో స్పెషల్ ఏజెంట్‌గా అఖిల్ కనిపిస్తాడేమోనని ఓ అంచనా. ఏదేమైనా ఈ ఇద్దరు ఏజెంట్స్ కలిసి స్క్రీన్‌పై కనిపించడమంటే ఫ్యాన్స్‌కి పండగే.
This post was last modified on October 20, 2021 11:24 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…