ఇంతకుముందులా సినిమాలు అర్ధశత దినోత్సవాలు.. శత దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి ఎంతమాత్రం లేదు. దశాబ్దం కిందటే ఆ పరిస్థితులకు తెరపడింది. కొన్నేళ్ల ముందు వరకు ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కొన్ని వారాలైనా బాగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత మంచి టాక్ తెచ్చుకున్న, ఏ స్థాయి సినిమా అయినా ఒకట్రెండు వారాలకు మించి నడవట్లేదు. చాలా వరకు వారం రోజుల్లో సినిమాలు థియేటర్ల నుంచి లేచిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే కొత్త చిత్రాలు ఏం రాబట్టుకున్నా తొలి వారాంతంలో రాబట్టుకోవాలి. ఆ తర్వాత నిలవడం చాలా కష్టం. ప్రతి శుక్రవారం కొత్తగా రెండు మూడు చిత్రాలు వచ్చేస్తుంటాయి కాబట్టి ప్రేక్షకుల ఫోకస్ వాటి మీదికి మళ్లిపోతుంటుంది. ముందు వారం వచ్చిన సినిమాలను పట్టించుకోవడం మానేస్తారు.
ఈ వారం సరైన సినిమాలు లేవన్నపుడు మాత్రమే గత వారపు చిత్రాలను పట్టించుకుంటారు. ఈ మధ్య అలా ప్రయోజనం పొందిన సినిమా ‘లవ్ స్టోరి’ మాత్రమే. ఈ సినిమా రిలీజ్ తర్వాత రెండు వారాల్లో సినిమాలు ప్రేక్షకులకు అంతగా రుచించకపోవడంతో దీనికి 2, 3 వారాల్లో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు దసరా సినిమాలకు ఆ అడ్వాంటేజ్ కనిపిస్తోంది. పండక్కి మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్ళిసంద-డి చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. వాటిలో మహాసముద్రం ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దానికి పండుగ సమయంలో కూడా ఆశించిన వసూళ్లు రాలేదు.
కానీ కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అలాగే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న పెళ్ళిసంద-డి మాత్రం అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టుకున్నాయి. అవి రెండూ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేశాయి. ఈ వారం నాట్యం, అసలేం జరిగింది, మధుర వైన్స్, క్లిక్.. ఇలాంటి అంతగా పేరు లేని చిత్రాలే రిలీజవుతున్నాయి. నోటెడ్ రిలీజ్‌లు ఏమీ లేవు.
రామ్ చరణ్, చిరంజీవి ప్రమోట్ చేసినప్పటికీ ‘నాట్యం’కు అంతగా బజ్ కనిపించడం లేదు. మిగతా సినిమాల గురించి చెప్పడానికేమీ లేదు. ఏదో నామమాత్రంగా రిలీజవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్ళిసంద-డి చిత్రాలు ఈ వారాంతంలోనూ జోరు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on October 20, 2021 11:29 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…