Movie News

ఒక్క క్లైమాక్స్‌కే 50 కోట్లా?

‘బాహుబలి’తో ఇండియాలో మరే హీరోకూ సాధ్యం కాని స్థాయిని అందుకున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ ఇమేజ్ రావడంతో అతను వరుసగా తన రేంజికి తగ్గ సినిమాలే చేస్తున్నాడు. ఇకపై అతను చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేసేలా కనిపించడం లేదు.

ప్రభాస్ సినిమా అంటే ప్రేక్షకులు ఒక భారీతనం ఆశిస్తుండటంతో ఓ మోస్తరు బడ్జెట్లో చేయాలనుకుని మొదలుపెట్టిన సినిమాలు కూడా తర్వాత పెద్ద రేంజికి వెళ్లిపోతున్నాయి. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’ మీడియం బడ్జెట్లో చేయాలనుకున్నదే. కానీ తర్వాత దాని బడ్జెట్ అమాంతం పెరిగిపోయి 300 కోట్లను దాటిపోయింది. దీని తర్వాత ప్రభాస్ మొదలుపెట్టిన ‘రాధేశ్యామ్’ కూడా అంతే.

దీన్ని మామూలు ప్రేమకథలా తీయాలనుకున్నారు. యాక్షన్ అవసరం లేని సినిమా కావడంతో బడ్జెట్ మరీ ఎక్కువేమీ కాదనుకున్నారు. కానీ భారీ సెట్టింగ్స్ వేయడం.. ఒక నగరాన్నే సెట్టింగ్స్ ద్వారా పున:సృష్టించే ప్రయత్నం చేయడం.. విదేశాల్లో వేర్వేరు లొకేషన్లలో షూటింగ్ చేయడం బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఈ ప్రేమకథా చిత్రానికి కూడా రూ.250 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో కేవలం క్లైమాక్స్ కోసం రూ.50 కోట్లు వెచ్చించారట. దాదాపు 15 నిమిషాలు సాగే క్లైమాక్స్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లేలా ఉంటుందని.. ఆ భారీతనం, విజువల్స్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారని అంటున్నాయి చిత్ర వర్గాలు. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘రాధేశ్యామ్’ను జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేర్వేరు కాలాల్లో సాగే ఈ ప్రేమక చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి ‘సాహో’ లాగా కాకుండా ఈ సినిమా అయినా అంచనాలను అందుకుని ప్రభాస్‌కు మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.

This post was last modified on October 20, 2021 4:14 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

3 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

3 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago