Movie News

శ్రీకాంత్‌కు ఓటేశా.. అత‌ను చేసిందేంటి-కోట‌

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు కావస్తోంది. కానీ ఆ ఎన్నికల తాలూకు మంటలు మాత్రం ఇంకా చల్లారడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పట్ల ముందు నుంచి తనకున్న వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఎన్నికలకు ముందు మంచు విష్ణుకు తన మద్దతు ప్రకటించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.

ఈ క్రమంలో తాను ఎన్నికల్లో ఎవరికి ఓటేసింది కూడా ఆయన వెల్లడించారు. మంచు విష్ణుకు మద్దతిచ్చినంత మాత్రాన ఆయన ప్యానెల్లో అందరికీ తాను ఓటు వేయలేదని ఆయన చెప్పారు. ఓవైపు అధ్యక్షుడిగా విష్ణుకు ఓటు వేసిన తాను.. ఉపాధ్యక్షుడిగా మాత్రం శ్రీకాంత్‌కు ఓటు వేసినట్లు కోట తెలిపారు. ఐతే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. శ్రీకాంత్‌తో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు చెందిన అందరూ మంచు విష్ణు బృందంతో కలిసి పని చేయాల్సిందని కోట అభిప్రాయపడ్డారు.

ఇంతకుముందు అలా జరిగింది, నరేష్‌తో ఇబ్బందైంది.. కలిసి పని చేయలేకపోయా అని సాకులు చెప్పి ఇప్పుడు తమ పదవులకు రాజీనామా చేయడం అర్థ రహితమని కోట అన్నారు. తనతో పాటు శ్రీకాంత్‌ను నమ్మి ఓటేసిన వాళ్లకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంత్ స్థానంలోకి ఊరూ పేరూ లేని వాళ్లను తెచ్చి పెడితే సభ్యుల పరిస్థితి ఏంటని ఆయనన్నారు.

ఇక ఎన్నికల సందర్భంగా టీవీల ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతుదారైన నాగబాబు, మంచు విష్ణు సపోర్టర్ అయిన నరేష్‌లను ఆయన తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి నాగబాబు ముఖ్య కారణం అని, ఆయన అవసరం లేని విషయాలన్నీ మాట్లాడారని కోట అన్నారు. నరేష్ సైతం ఊరికే మీడియా ముందుకొచ్చి నానా చెత్త మాట్లాడారని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో కులం కీలక పాత్ర పోషించిందని.. తనకు ఇండస్ట్రీలో ఫుడ్ పెట్టింది 95 శాతం కమ్మలే అని, వాళ్లకు తాను ఎన్నికల్లో మద్దతుగా నిలవాలనుకున్నానని కోట వ్యాఖ్యానించడం గమనార్హం.

This post was last modified on October 20, 2021 4:11 pm

Share

Recent Posts

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

1 hour ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

2 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

2 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

5 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

5 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

6 hours ago