పూజా హెగ్డేను ప్రస్తుతం టాలీవుడ్ అనే కాదు.. సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఇండియా మొత్తంలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ల సరసన నటించి ఆమె.. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనూ జత కట్టబోతోంది.
అలాగే తమిళంలో విజయ్ లాంటి టాప్ స్టార్‌తో నటిస్తోంది. మరోవైపు హిందీలోనూ సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. హిట్ల మీద హిట్లు కొడుతూ.. మంచి మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్న పూజా.. తాజాగా తన ట్విటర్ అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా ఆమెకు కొన్ని కొంటె ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఒక నెటిజన్ అయితే.. మనిద్దరి రిలేషన్‌షిప్ గురించి ఈ ప్రపంచానికి ఎప్పుడు చెబుదాం అంటూ పూజాను కవ్వించాడు. దీనికి పూజా ఇచ్చిన రిప్లై ట్విట్టర్లో వైరల్ అయిపోయింది. ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం.. రక్షాభందన్ రోజున అని. అంటే అతనేమో పూజా తన ప్రేయసి అన్నట్లుగా మాట్లాడితే.. ఆమె మాత్రం అతణ్ని సోదరుడిగా భావిస్తున్నట్లుగా పంచ్ ఇచ్చింది.
పూజా ఎంతో కూల్‌గా ఇచ్చిన ఈ ఆన్సర్ నెటిజన్లకు భలే నచ్చేసింది. ఇక కెరీర్ సంబంధిత ప్రశ్నలు అడిగినపుడు కూడా పూజా ఇంతే కూల్‌గా ఆన్సర్లు ఇచ్చింది. అమితాబ్ బచ్చన్‌తో నటించడం తన కల అని, ఏదో ఒక రోజు ఆ కల నెరవేరుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన పూజా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చూసి చిరంజీవి తనను అభినందిస్తూ మెసేజ్ చేశారని, అది తనకెంతగానో స్ఫూర్తిగా నిలిచిందిని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. ‘రియల్’ అని బదులిచ్చిన ఆమె.. దళపతి విజయ్ ‘స్వీటెస్ట్’ అని పేర్కొంది.
This post was last modified on October 20, 2021 4:07 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…