ఇటు హీరోగానూ అటు విలన్‌గానూ కూడా రాణించేందుకు రెడీ అయ్యాడు కార్తికేయ. విలన్‌గా తనలోని పర్‌ఫార్మర్‌కి ఫుల్ మార్కులు వేయించుకున్నాడు. హీరోగా మాత్రం సరైన సక్సెస్ ఖాతాలో పడక సతమతమవుతున్నాడు. ‘రాజా విక్రమార్క’తో తన ఆశ నెరవేరుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
వీవీ వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి డైరెక్షన్‌లో 88 రామారెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నటిస్తున్నాడు కార్తికేయ. సీనియర్ కన్నడ స్టార్ రవిచంద్రన్ మనవరాలు తాన్యా హీరోయిన్‌గా నటిస్తోంది. సుధాకర్ కోమాకుల ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 12న రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టినట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్.
టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టినీ తన సినిమావైపు తిప్పుకున్నాడు కార్తికేయ. అప్పట్లో చిరంజీవి హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ భారీ విజయం సాధించింది. మెగాస్టార్ మీద అభిమానంతో అదే టైటిల్‌ను ఏరి కోరి ఈ సినిమాకి పెట్టారు. ఆమధ్య రిలీజైన టీజర్ ఇంటరెస్టింగ్‌గా ఉండటంతో మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది. దానికి తోడు మెగాస్టార్ టైటిల్ సెంటిమెంట్ కూడా వర్కవుటయ్యి కార్తికేయకి కలిసొస్తుందేమో చూడాలి మరి.
This post was last modified on October 20, 2021 3:48 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…