అదేం చిత్రమో కానీ.. టాలీవుడ్లో చాలామంది హీరోలకు తిరుగులేని విజయాలందించి వాళ్ల ఇమేజ్‌ను మార్చేసి, కెరీర్లను మరో స్థాయికి తీసుకెళ్లిన అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్.. తన కొడుకు పూరి ఆకాశ్‌కు మాత్రం సరైన విజయాన్నందించలేకపోయాడు. అతడి కెరీర్‌ను సరిగా ప్లాన్ చేయడంలోనూ పూరి విఫలమయ్యాడనే చెప్పాలి.
ఆకాశ్ టీనేజీలో ఉండగా తొందరపడి ఆంధ్రాపోరి అనే సినిమా చేయించాడు. అది ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. ఆకాశ్‌ను పూర్తి స్థాయి హీరోగా అయినా సరైన సినిమాతో పరిచయం చేశాడా అంటే అదీ లేదు. తాను పేలవమైన ఫాంలో ఉన్న టైంలో మెహబూబా అనే లవ్ స్టోరీ చేశాడు కొడుకుతో. అది డిజాస్టర్ అయింది. ఇక ఆకాశ్ తర్వాతి సినిమాకైనా జాగ్రత్త పడ్డాడా అంటే అలాంటి సంకేతాలేమీ కనిఇపంచడం లేదు.
ఆకాశ్ కొత్త చిత్రం రొమాంటిక్ ట్రైలర్ మంగళవారమే రిలీజైంది. దాన్ని చూస్తే పూరి తీసిన నేను నా రాక్షసి, రోగ్ లాంటి డిజాస్టర్లు గుర్తుకొస్తున్నాయి జనాలకు. ఈ సినిమాకు పూరి దర్శకుడు కాదు కానీ.. సినిమా మాత్రం ఆయన తీసినట్లే ఉంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చింది పూరీనే, సినిమా తీసిందేమో పూరి శిష్యుడైన అనిల్ పాడూరి.
మరి అది పూరి సినిమాలా కాకుండా ఇంకెలా ఉంటుంది. అమ్మాయిని కసిగా.. కొరుక్కుతినేయాలన్నట్లు చూసే హీరో.. నీకేం కావాలని అడుగుతూ అతణ్ని తిట్టిపోసే హీరోయిన్.. ఒక దశ దాటాక ఇద్దరి మధ్య ఘాటు రొమాన్స్.. ఇలా పూరి తీసిన చాలా సినిమాల టెంప్టేట్ స్టయిలే ఇందులోనూ కనిపిస్తోంది.
మామూలుగా ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమ అనుకుని అట్రాక్షన్లో ఉంటారని.. కానీ వీళ్లు నిజమైన ప్రేమను అట్రాక్షన్ అనుకుంటున్నారు.. ఈ డైలాగ్‌ను బట్టి ఇదేదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం అని ప్రొజెక్ట్ చేయాలని చూశారు కానీ.. ట్రీట్మెంట్ మాత్రం చాలా రొటీన్‌గా, ఓల్డ్ స్టయిల్లో ఉంది. పూరి తీసిన ఈ టైపు లవ్ స్టోరీలు ఎప్పుడో మొహం మొత్తేశాయి. అందుకే ఆయన కూడా అవి వదిలేసి ఇస్మార్ట్ శంకర్, లైగర్ అంటూ యాక్షన్ సినిమాలు చేసుకుంటున్నాడు. మరి ఇలాంటి సినిమాతో కొడుక్కి పూరి ఏం లైఫ్ ఇస్తాడన్నది డౌట్‌గానే ఉంది. చూద్దాం అక్టోబరు 29న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో?
This post was last modified on October 20, 2021 8:01 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…