తమ ఫేవరేట్ హీరోని ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్‌లో చూడటం ఫ్యాన్స్‌కి భలే కిక్కిస్తుంది. అందుకే డ్యూయెల్ రోల్ చేయడానికి హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో రెండు రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు. విశేషమేమిటంటే.. నెక్స్ట్ మూవీలోనూ ఆయన ఇద్దరిగానే కనిపిస్తారట.
‘క్రాక్’తో భారీ హిట్టు కొట్టిన గోపీచంద్ మలినేని చేతిలో తన నెక్స్ట్ మూవీని పెట్టారు బాలయ్య. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలయ్య కోసం ఓ ఖతర్నాక్ స్టోరీని రెడీ చేశానని ఆల్రెడీ గోపీచంద్ చెప్పాడు. ఆయన కోసం రెండు వేరియేషన్స్ రెడీ చేశాడట. ఒక రోల్‌లో ఫ్యాక్షనిస్ట్‌గా, మరో పాత్రలో ఆధ్యాత్మిక గురువుగా బాలయ్య కనిపిస్తారని సమాచారం.
అయితే ప్రస్తుతం చేస్తున్న ‘అఖండ’లో ఒక పాత్ర అఘోరా. మళ్లీ వెంటనే స్వామీజీగానో ఆధ్మాత్మిక గురువుగానో నటిస్తే ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఉంటుందా, యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌట్. అయితే గోపీచంద్ ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేయలేదు కాబట్టి ఫుల్ క్లారిటీ రాలేదు. త్రిష హీరోయిన్‌గా నటించనుందని, కర్ణాటక బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నడుస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
This post was last modified on October 19, 2021 12:04 pm
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…