నేచురల్ స్టార్ నాని గత నెలలోనే ‘టక్ జగదీష్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. నాని నుంచి నేరుగా ఓటీటీలో రిలీజైన రెండో సినిమా ఇది. గత ఏడాది ‘వి’ కూడా ఈ రూట్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాంతో పాటు ‘టక్ జగదీష్’కు కూడా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఈసారి నాని తన సత్తా ఏంటో చూపించాల్సిన స్థితిలో ఉన్నాడు. పైగా ఆ సత్తా చూపించాల్సింది థియేటర్లలో. ఇంకోసారి ఓటీటీ దారిలోకి వెళ్తే ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పకపోవచ్చు.
ఆ సంగతి తెలిసే తన కొత్త సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ని థియేట్రికల్ రిలీజ్‌కే సిద్ధం చేశాడు నాని. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ రూపొందించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ రిలీజ్ అని ఇంతకుముందే ప్రకటించారు కాబట్టి 24న రిలీజ్ డేట్ ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు.
కానీ ‘శ్యామ్ సింగ రాయ్’ని దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించడమే ఒక కరమైన షాక్ అని చెప్పాలి. నాని ఇప్పటిదాకా ఇలా నాలుగు సౌత్ లాంగ్వేజెస్‌లో సినిమా రిలీజ్ చేసింది లేదు. అతను ప్రత్యేక పాత్రలో నటించిన ‘ఈగ’ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. అలాగే ‘సెగ’ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. అంతే తప్ప ఇలా నాలుగు దక్షిణాది భాషల్లో నాని చిత్రం ఏదీ విడుదల కాలేదు.
నాని ఇప్పుడీ సాహసం చేస్తుండటానికి ‘శ్యామ్ సింగరాయ్’ మీద ఉన్న నమ్మకం ఒక కారణం కావచ్చు. అలాగే సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్ లాంటి హీరోయిన్లు ఇందులో కీలక పాత్రలు పోషించడం మరో కారణంగా చెప్పొచ్చు. వీళ్లిద్దరూ తమిళం, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు పరిచయమే. ముఖ్యంగా సాయిపల్లవికి సౌత్ అంతటా ఫాలోయింగ్ ఉంది. ఇంకో హీరోయిన్ కృతిశెట్టి కూడా ‘ఉప్పెన’ ద్వారా దక్షిణాదిన మంచి పాపులారిటీనే తెచ్చుకుంది.
నానికి తమిళంలో మంచి గుర్తింపే ఉంది. కన్నడలో మామూలుగానే తెలుగు చిత్రాలకు మంచి స్పందనే వస్తుంటుంది. అతను సాయిపల్లవి, మడోన్నాల అండతో కొత్తగా మలయాళంలోకి అడుగు పెడుతున్నాడు. ఇంతకుముందు విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’తో ఇలాగే దక్షిణాది ప్రేక్షకులందరినీ పలకరించాడు. కానీ అతడికి మంచి ఫలితం దక్కలేదు. మరి నాని సినిమాకు సౌత్‌లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on October 18, 2021 11:16 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…