కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన సినిమా మన తెలుగుదే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరికి ఎంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయో తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ భారీ చిత్రం స్థాయిలో జరగడంతో డివైడ్ టాక్‌ను తట్టుకుని కూడా తొలి వారాంతంలో పాతిక కోట్ల దాకా షేర్ రాబట్టిందీ చిత్రం. వీకెండ్ తర్వాత కొంచెం నెమ్మదించినా కూడా ఓవరాల్‌గా రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది లవ్ స్టోరి.
తొలి రోజు, తొలి వారాంతం, అలాగే ఫుల్ రన్ వసూళ్లలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది లవ్ స్టోరి. ఏ భాషలో అయినా ఏదైనా భారీ చిత్రం వస్తే తప్ప లవ్ స్టోరి రికార్డులు బద్దలు కావనుకున్నారంతా. కానీ తమిళంలో శివ కార్తికేయన్ సినిమా డాక్టర్.. అంచనాల్ని మించి విజయం సాధించి లవ్ స్టోరి రికార్డులన్నింటినీ అధిగమించేసింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ముందు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు కానీ.. మంచి రివ్యూలు రావడం, థియేటర్లలో ఉన్న మిగతా తెలుగు చిత్రాల కంటే మెరుగైన సినిమా అనే టాక్ ఉండటంతో మన వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లకు మంచి లాభాలే తెచ్చిపెట్టిందీ సినిమా.
ఇక తమిళంలో డాక్టర్ అంచనాల్ని మించి ఆడేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. తమిళంలో గత ఏడాది కరోనా ప్రభావం మొదలయ్యాక సంక్రాంతికి విడుదలైన మాస్టర్ కాకుండా మరే చిత్రం ఈ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు. రెండో వారంలోనూ మంచి వసూళ్లతో ఈ సినిమా దూసుకెళ్తోంది. దసరా సెలవులను బాగానే క్యాష్ చేసుకుంటోంది.
ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌కు ఇది రెండో సినిమా మాత్రమే. తొలి చిత్రం కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల) సూపర్ హిట్ కాగా.. డాక్టర్ చేస్తున్న సమయంలోనే విజయ్‌తో బీస్ట్ లాంటి భారీ చిత్రం చేసే అవకాశం పట్టేశాడతను. డాక్టర్‌లో గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక మోహన్ కథానాయికగా నటించింది. కిడ్నాపింగ్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్నే అందిస్తోంది.
This post was last modified on October 17, 2021 6:34 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…