రామ్ చరణ్ చివరి సినిమా వినయ విధేయ రామ 2019 జనవరిలో విడుదలైంది. ఆ సినిమా రిలీజ్‌కు కొన్ని నెలల ముందే చిత్రీకరణ పూర్తి చేసి ఆర్ఆర్ఆర్ మీదికి తన ఫోకస్ షిఫ్ట్ చేశాడు చరణ్. ఈ సినిమా కోసం ఫిజిక్, లుక్ చాలానే మార్చుకున్నాడు చరణ్. కోర మీసం, షార్ట్ కటింగ్‌తో డిఫరెంట్ లుక్‌లోకి వచ్చేశాడు చరణ్. ఇక అప్పట్నుంచి చరణ్ లుక్‌లో ఎప్పుడూ మార్పు లేదు.
మూడేళ్లుగా అదే అవతారంతో కనిపిస్తూ వచ్చాడు. అప్పుడప్పుడూ కొంచెం గడ్డం మాత్రమే పెంచాడు. మధ్యలో ఆచార్య సినిమా చేయాల్సి వస్తే.. చిన్న చిన్న కరెక్షన్లు చేసుకుని నటించాడు. ఆర్ఆర్ఆర్ లుక్ మాత్రం అలాగే మెయింటైన్ చేశాడు. రాజమౌళి సినిమా అంటే.. ఏ నటుడైనా ఆయనకు ఇలాగే సరెండర్ అయిపోవాల్సిందే. సినిమాకు అంకితం కావాల్సిందే.
ఆర్ఆర్ఆర్ టాకీ పార్ట్ అయ్యాక కూడా పాటలు, ప్యాచ్ వర్క్ కోసం చరణ్ లుక్ అలాగే కంటిన్యూ చేశాడు. శంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టాక కూడా లుక్ మార్చలేదు. కొన్ని రోజుల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ ఎన్నికల్లో పాల్గొన్నపుడు కూడా చరణ్ ఆర్ఆర్ఆర్ లుక్‌లోనే కనిపించడం తెలిసిందే.
ఐతే ఎట్టకేలకు చరణ్ ఈ లుక్‌కు తెరదించాడు. మూడేళ్ల తర్వాత మీసంపై కత్తెర వేశాడు. ఆ కోర మీసం అంతా కట్ చేసి.. ధ్రువ లుక్‌కు దగ్గరగా ఉండేలా మీసాన్ని కట్ చేయించాడు. ఈ కొత్త లుక్‌తోనే నాట్యం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు చరణ్.
బహుశా ఇది శంకర్ సినిమా కోసం మార్చుకున్న లుక్ కావచ్చు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ షూట్‌కు సంబంధించి చరణ్ పని మొత్తం పూర్తయినట్లే. ఆ సినిమా నుంచి అతడికి విడుదల దొరికినట్లే. ఇక అతను ప్రమోషన్లలో మాత్రమే పాల్గొనాలన్నమాట.
This post was last modified on October 17, 2021 10:42 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…