ఈసారి దసరా సీజన్లో మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. మూడింట్లో దేనికీ పూర్తి సానుకూల స్పందన లేదు ఆడియన్స్ నుంచి. ఐతే పెళ్ళి సందడి మరీ పేలవంగా ఉండటంతో చూసిన ప్రేక్షకులు బెంబేలెత్తిపోతున్నారు. మహాసముద్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఈ రెంటితో పోలిస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మెరుగే.
పండుగ టైంలో ఏదో ఒక సినిమా చూడాలి అనుకున్న వాళ్లందరికీ ఇదే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఐతే సినిమా అనుకున్నంత సంతృప్తిని మాత్రం ఇవ్వట్లేదు. ఉన్న సినిమాల్లో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కొంతమేర ఎంగేజ్ చేసే సినిమా ఇదే అని చెప్పాలి. తొలి రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే ప్రభావం చూపేలా కనిపిస్తోంది. బరిలో ఉన్న మిగతా సినిమాలకు మంచి టాక్ వచ్చి ఉంటే మాత్రం తట్టుకుని నిలబడే స్థాయి చిత్రమైతే కాదిది.
బొమ్మరిల్లు భాస్కర్ తన డిజాస్టర్ మూవీ ఆరెంజ్ తరహాలోనే మళ్లీ ప్రేమ.. పెళ్లి.. వైవాహిక జీవితం.. అంటూ డ్రై సబ్జెక్టే తీసుకున్నాడు ఈసారి కూడా. ఐతే దాంతో పోలిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న మాట వాస్తవమే కానీ.. ఆరెంజ్ లాగా సిన్సియర్‌గా అయితే ఈ సినిమా తీయలేదు. సిల్లీగా అనిపించే.. లాజిక్ లెస్ సీన్లు బోలెడున్నాయిందులో.
అయినా సినిమా ఈమాత్రం ఆడుతోందంటే అందులో పూజా హెగ్డే పాత్ర కీలకం. టాప్ ఫాంలో ఉన్న పూజ కోసమే యూత్ ఈ సినిమాకు పెద్ద ఎత్తున వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తన గ్లామర్‌తో పూజా రిలీజ్ ముంగిటే ఈ సినిమాకు మంచి బజ్ తీసుకురాగలిగింది. ఇక సినిమాలో ఆమె పాత్ర కూడా బాగానే హైలైట్ అయింది. పూజా ఫ్యాన్స్‌కు అయితే ఈ సినిమా కనువిందే.
అందం, అభినయం రెంటితోనూ పూజా ఆకట్టుకుంది. ఆమె ముందు అఖిల్ ఏ రకంగానూ నిలవలేకపోయాడన్నది వాస్తవం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయి.. అఖిల్ ఖాతాలో తొలి హిట్ పడితే అందులో మేజర్ క్రెడిట్ పూజాదే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ హీరోను సూచించే టైటిల్ పెట్టారు కానీ.. చివరికిది హీరోయిన్ వల్ల ఆడిన సినిమాగానే నిలవబోతోందన్నది స్పష్టం. సక్సెస్ క్రెడిట్ కూడా ఆమెకే చెందుతుంది తప్ప.. అఖిల్‌కు పెద్దగా మైలేజీ వచ్చే అవకాశాలు లేనట్లే.
This post was last modified on October 16, 2021 10:15 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…