నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ పూర్తై చాలా కాలమైంది. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పడుతుందని, వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తామని టీమ్ ప్రకటించింది. ఇప్పుడు దసరా సందర్భంగా రిలీజ్ అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్‌లో థియేటర్స్‌లో కలుస్తామని కన్‌ఫర్మ్ చేసింది.
బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ మూవీ నుంచి ఆమధ్య రిలీజైన నాని ఫస్ట్ లుక్ అందరినీ ఎంతో ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ నాని క్యారెక్టర్‌లోని మరో షేడ్‌ని కూడా పరిచయం చేశారు మేకర్స్. రెండు లుక్స్‌తో మోషన్ పోస్టర్ని వదిలారు. శ్యామ్ సింగ రాయ్ గెటప్‌లో.. కాళీమాత విగ్రహం ముందు సీరియస్‌గా నిలబడి ఉన్న బెంగాలీ యువకుడిగా నాని లుక్ ఎంత ఆకట్టుకుందో.. వాసు అనే తెలుగబ్బాయి పాత్రలోనూ అతని లుక్ అంతే ఇంటెన్స్‌గా ఉండి మెప్పిస్తోంది. రెండు పాత్రలకూ అతను సరిగ్గా సూటయ్యాడనిపిస్తోంది. రెండు పాత్రల్నీ రివీల్ చేసేటప్పుడు మిక్కీ జె మేయర్ డిఫరెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం మోషన్ పోస్టర్‌ని మరింత ఎఫెక్టివ్‌గా మార్చింది.
ఈ చిత్రానికి ‘అతని ప్రేమ.. అతని లెగసీ.. అతని మాట’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. చాలామంది ఎక్స్పర్ట్స్ దానిపై పని చేస్తున్నారని టీమ్ చెబుతోంది. సాయిపల్లవి, కృతీశెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
This post was last modified on %s = human-readable time difference 9:42 pm
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…