టాలీవుడ్లో పెద్దగా హడావుడి లేకుండా చకచకా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో నాని ఒకడు. కరోనా వల్ల కొంచెం స్పీడు తగ్గింది కానీ.. మామూలుగా అతను ఏడాదికి మూడు సినిమాలు లాగించేస్తుంటాడు. అలా అని రొటీన్ సినిమాలతో సర్దుకపోయే రకం కూడా కాదు నాని. చాలా వరకు వైవిధ్యమైన కథలే ఎంచుకుంటుంటాడు.
ఈ మధ్య వి, టక్ జగదీష్ లాంటి రొటీన్ టచ్ ఉన్న చిత్రాలతో నిరాశ పరిచిన నాని.. వీటి తర్వాత శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి లాంటి వైవిధ్యమైన సినమాలతో పలకరించబోతున్నాడు. ఇప్పుడు నాని చేయబోయే మరో కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది.
దసరా సందర్భంగా ఈ నెల 15న ఈ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. ముందుగా ప్రి లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అది చూస్తే మొత్తం నలుపు రంగుతో నిండిపోయి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలను తలపించింది.
ఈ సినిమా నేపథ్యాన్ని సూచించేలాగే ఈ పోస్టర్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇది సింగరేణి గనుల నేపథ్యంలో సాగే సినిమా అని.. నాని సరికొత్త అవతారంతో షాక్ ఇవ్వబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి దసరా అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నెల 15న రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ స్టన్నింగ్‌గా ఉంటుందట.
ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. పడి పడి లేచె మనసు, విరాటపర్వం చిత్రాలతో పాటు రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి నాని 29వ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్నందించనున్నాడట.
తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న సంతోష్.. వెంకటేష్ చేసిన డబ్బింగ్ సినిమా గురుతో తెలుగులోకి అడుగు పెట్టాడు. కబాలి సహా కొన్ని తమిళ అనువాద చిత్రాలతోనూ మన ప్రేక్షకులను పలకరించాడు. కానీ అతను చేస్తున్న ఒరిజినల్ తెలుగు సినిమా అంటే ఇదే అని చెప్పాలి.
This post was last modified on October 14, 2021 4:53 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…