లాక్ డౌన్ టైంలో సొంత ఊరిలో కూర్చుని ఎఫ్3 స్క్రిప్ట్ సిద్ధం చేసేసాడు అనిల్ రావిపూడి. షూటింగ్స్ మొదలైతే జులై నుంచి షూటింగ్ మొదలు పెట్టి సంక్రాంతికి సిద్ధం చేసేద్దాం అనుకున్నాడు. కానీ వెంకటేష్ కి ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టే ఉద్దేశం లేదు. కరోనా విజృంభిస్తున్న టైంలో తొందర ఏముందని వచ్చే ఏడాది చూద్దాం అని వెంకీ చెప్పేశారట.
ఇంకా వెంకటేష్ సినిమా నారప్ప షూటింగ్ పూర్తి కాలేదు. అలాగే రానా దగ్గుబాటి పెళ్లి కూడా ఇదే ఏడాదిలో ఉంటుంది. అందుకే ఈ టైంలో హడావుడి షూటింగ్స్ ఏమీ వెంకటేష్ పెట్టుకోవడం లేదు. సరిలేరు నీకెవ్వరు హిట్టయినా కానీ రావిపూడికి అగ్ర హీరోల డేట్స్ దొరకలేదు. దాంతో ఎఫ్2 సీక్వెల్ చేయడానికి ఉపక్రమించాడు.
అయితే చాలా మంది ప్లాన్స్ అప్సెట్ చేసిన కరోనా రావిపూడి ప్రయత్నాలపై కూడా నీళ్లు చల్లేసింది. మరి ఈ సినిమా మొదలు పెట్టే వరకు వేచి చూస్తాడో, లేక మరేదైనా ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కిస్తాడో చూడాలి.
This post was last modified on June 2, 2020 5:54 pm
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…