పాజిటివ్ పాత్రలు చేయడం కంటే, నెగిటివ్ రోల్స్‌ని పండించడం చాలా కష్టం. అయితే అలాంటి క్యారెక్టర్ట్ చేసినప్పుడే ఓ నటుడి టాలెంట్ బయట పడుతుంది. అందుకే మన యంగ్ హీరోస్‌లో చాలామంది నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా ఓకే అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో విలన్లుగా కనిపించి మెప్పిస్తున్నారు. కార్తికేయ కూడా అదే దారిలో సాగుతున్నాడు.
‘ఆర్‌ఎక్స్ 100’లో భగ్న ప్రేమికుడిగా కంటతడి పెట్టించిన కార్తికేయకి, ఆ తర్వాత అంతటి విజయం దక్కలేదు. కానీ ‘గ్యాంగ్‌లీడర్’లో విలన్ పాత్ర మాత్రం చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. దానివల్లే అజిత్ ‘వలిమై’లో ప్రతినాయక పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. దానికి చాలా సంతోష పడుతున్నాడు కార్తికేయ. రేసర్ గెటప్‌లో అజిత్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నేనెంతో గర్వంగా చెప్పుకునే మూమెంట్స్‌లో ఇదొకటి అని చెప్పాడు.
అజిత్ సినిమా అంటే ఏ స్థాయిలో తెరకెక్కుతుందో తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎంచుకోవడం, సినిమా సినిమాకీ లుక్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపించడం అజిత్ స్టైల్. వలిమై మూవీ విషయంలోనూ అదే కేర్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. అలాగే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండే ఈ చిత్రంలో బైక్ రేసులు ప్రధాన పాత్ర పోషిస్తాయని టీజర్ చూశాక అర్థమయ్యింది.
ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ శత్రువులుగా మారితే ఏం జరుగుతుందనేది స్టోరీ అట. ఎనిమీస్‌గా మారిన తర్వాత కార్తికేయ, అజిత్‌ల మధ్య వార్ ఓ రేంజ్‌లో ఉంటుందట. సినిమా చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా అజిత్‌తో కార్తికేయ పోటీపడి మరీ నటించాడని, అతని పాత్ర కూడా హీరోతో సమానంగా మెప్పిస్తుందని టీమ్ చెబుతోంది. ఇండస్ట్రీకి కత్తిలాంటి విలన్ దొరికాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే విలన్‌గా కార్తికేయకి మంచి ఫ్యూచరే ఉందనిపిస్తోంది.
This post was last modified on October 14, 2021 6:51 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…