ఈ ఏడాదికి ఇక మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే ‘పుష్ప: ది రైజ్’ అనే చెప్పాలి. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. వివిధ భాషల వాళ్లు ఈ భారీ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ లాంటి నాన్ బాహుబలి హిట్ తర్వాత అల్లు అర్జున్.. దీని కంటే ముందు నాన్ బాహుబలి హిట్‌గా ఉన్న ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇది. వీళ్లిద్దరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ఆర్య, ఆర్య-2 కూడా ప్రత్యేకమైన చిత్రాలే కావడంతో ‘పుష్ప’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం నెవర్ బిఫోర్ అవతారంలోకి మారాడు బన్నీ.
తెలుగు హీరోలు ఇంత డీగ్లామరస్‌గా, మొరటుగా కనిపించడం అరుదు. బన్నీ చేస్తున్న పుష్పరాజ్ పాత్రకు సంబంధించి లుక్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ సహా అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధే తీసుకున్నట్లున్నారు.
‘పుష్ప’ నుంచి కొత్తగా రిలీజైన ‘శ్రీవల్లి’ పాటకు సంబంధించిన విజువల్స్ చూస్తే.. బన్నీ బాడీ లాంగ్వేజ్ కొంచెం చిత్రంగా అనిపిస్తోంది అందరికీ. అతను కొంచెం వైకల్యం కూడా ఉన్న వాడిగా కనిపించబోతున్నాడేమో ఈ సినిమాలో అనిపిస్తోంది. శ్రీ వల్లి పాటలో బన్నీ స్టెప్ ఒకటి లిరికల్ వీడియోలో చూపించారు. అందులో చూస్తే అతడి ఎడమ భుజాన్ని కొంచెం పైకెత్తి పెట్టుకున్నట్లుగా కనిపించింది. కొంచెం అంగ వైకల్యం ఉన్నవాడిలా కనిపించాడు బన్నీ అందులో.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘దాక్కో దాక్కో మేక’లో కూడా బన్నీ భుజం కొంచెం పైకే కనిపించింది. అదేదో యాదృచ్ఛికం అనుకున్నారు కానీ.. ఉద్దేశపూర్వకంగానే ఈ పాత్రను ఇలా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. దాన్నొక మేనరిజంలా చూపించడానికి అలా చేశారా.. లేక హీరోకు ఏదైనా వైకల్యం ఉన్నట్లు చెప్పబోతున్నారా అన్నది ఆసక్తికరం. సినిమా అంతటా కూడా బన్నీ ఇలాగే కనిపిస్తాడన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.
This post was last modified on October 13, 2021 5:50 pm
కొన్ని వెబ్ సిరీస్ లకు సినిమాల రేంజ్ హైప్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి ఉదాహరణలు.…
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ దగ్గుబాటి అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. నలభై యాభై కాదు…
ఇటీవలే తన స్వంత అపార్ట్ మెంట్ లో దాడికి గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కేసు రోజుకో…
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొదట వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. మొట్ట మొదట ట్రంప్ ‘అమెరికా…
పట్టుబట్టారు.. సాధించారు. ఈ మాటకు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ సహా.. నారా లోకే ష్ కూడా…
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, లింగ…