Movie News

నీలాంబరి నచ్చేసింది

ఏదైనా పండుగ వచ్చిందంటే తమ ఫేవరేట్ స్టార్స్ చేస్తున్న సినిమాల అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే ఈ దసరా సీజన్‌లో తమ సినిమాల గురించి ఏదో ఒక విశేషాన్ని రివీల్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ‘ఆచార్య’ టీమ్‌ నుంచి కూడా విజయదశమి నాడు ఓ అదిరిపోయే అప్‌డేట్ వస్తుందని మెగా ఫ్యాన్స్‌ చూస్తున్నారు. అయితే అంతకంటే ముందే పూజా హెగ్డే లుక్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసింది టీమ్.

ఇవాళ పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తున్న సినిమాల నుంచి రకరకాల అప్‌డేట్స్ వచ్చాయి. అలాగే ఆచార్య నుంచి ఓ బ్యూటిఫుల్ పోస్టర్ వచ్చింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్‌‌కి జోడీగా కాజల్ నటిస్తుంటే, కీలక పాత్రధారి రామ్‌చరణ్‌కి జంటగా పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. ఆమె పోషిస్తున్న నీలాంబరి పాత్ర ఎలా ఉంటుందో గతంలో ఓ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అమె అందమైన లుక్‌తో కనువిందు చేశారు.

లంగావోణీ వేసుకుని, నుదుటన చక్కగా బొట్టు దిద్దుకుని, విరబూసిన కురులతో, చూడముచ్చటైన చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది పూజ. చేతిలో పూజ సామాగ్రి ఉంది. బ్యాక్‌డ్రాప్‌లో గుడి కనిపిస్తోంది. మొత్తంగా ఈ పోస్టర్‌‌ సినీ ప్రియుల మనసు దోచేయడం ఖాయమనిపిస్తోంది. ఈ పండక్కి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌‌’తో రానున్న పూజ.. సంక్రాంతికి ‘రాధేశ్యామ్‌’తోను, ఆ తర్వాతి నెల ‘ఆచార్యతోను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్‌తో చేస్తున్న ‘బీస్ట్’ కూడా పొంగల్‌నే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రణ్‌వీర్‌‌ సింగ్‌తో నటిస్తున్న ‘సర్కస్’ వచ్చే వేసవి లోపే విడుదల కానుంది. అంటే బ్యాక్‌ టు బ్యాక్ ఐదు సినిమాలతో ఫీస్ట్ ఇవ్వబోతోంది పూజ.

This post was last modified on October 13, 2021 5:45 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago