ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేయడం సినిమా ప్రియులకు ఆనందకరమే కానీ నిర్మాతలకు మాత్రం ఇది లాభదాయకం కాదు. కంటెంట్ నిజంగా బ్రహ్మాండంగా వుంటే జనం ఎగబడి చూస్తారు. ఫలానా సినిమా చూడమంటూ పదిమందికి చెప్తారు. అదే సినిమా అంతంతమాత్రంగా ఉన్నట్టయితే ఓటిటీలో ఫ్రీగా చూడ్డానికి కూడా జనం అంతగా ఇష్టపడరు.
తమిళం నుంచి విడుదలైన జ్యోతిక సినిమా పోన్మగల్ వందాల్ కి ప్రచారం విపరీతంగా జరిగింది. విడుదలకి ముందు చాలా వివాదాలు కూడా సినిమాను వార్తల్లో ఉంచాయి. సూర్య నిర్మాత కావడం మరో పబ్లిసిటీ. అయితే ఇంత ప్రచారం పొందిన ఆ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో చూసినవాళ్లు పెదవి విరిచారు. విమర్శకులు కూడా మెచ్చుకోలేదు. దీంతో ఆ చిత్రానికి అంతగా ఆదరణ లేదు.
చిన్న సినిమా కనుక ఓటిటీ ఇచ్చిన అమౌంట్ ఓకే అయి ఉండొచ్చు. కానీ పెద్ద సినిమాలకు వ్యూస్ కూడా చాలా అవసరం. అదీగాక నెట్ లో సినిమా పెడితే పైరేట్స్ చేతిలో ఫుల్ హెచ్ డి ప్రింట్ పెట్టినట్టే. ఫలానా ఓటిటీలో ఉంది కదా అని జనం దానికి సబ్స్క్రయిబ్ చేసుకోరు. డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. అప్పుడు సదరు వ్యూస్ కౌంట్ లోకి రావు.
ఇన్నిరకాల తలనొప్పులు ఉండడంతో కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాని బొమ్మల పెట్టెలో చూపించడానికి నిర్మాతలు ఇష్టపడడం లేదు. ఆలస్యమయినా కానీ థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదల చేసుకుందాం అని వేచి చూస్తున్నారు.
This post was last modified on June 2, 2020 5:56 pm
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే.…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
రాజకీయ పార్టీల భవితవ్యం ఏంటనేది.. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి.. సర్వేలు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో నాయకులు…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…