బాలీవుడ్ సినిమా సైన్ చేసిన సమంత!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత పెళ్లి తరువాత డిఫరెంట్ క్యారెక్టర్లను ఎన్నుకుంటూ సినిమాలు చేసింది. ఈ క్రమంలో వరుస విజయాలను అందుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ తన భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో సమంతపై దారుణమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేశారు. వీటన్నింటికీ సమంత గట్టి సమాధానమిచ్చింది. ఇలాంటివేవీ తనను బ్రేక్ చేయలేవని బలంగా చెప్పింది.

ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా సైన్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. దీంతో పాటు సమంత ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేసిందని సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ తరువాత సమంతకు బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది.

హిందీలో ఆమెకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ సమంత పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు తన మొదటి బాలీవుడ్ సినిమాకి సంతకం చేసినట్లు తెలుస్తోంది. దసరా తరువాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనుంది. అలానే కొందరు బాలీవుడ్ మేకర్స్ ఆమెని కలిసి కథలు చెబుతున్నట్లు సమాచారం. ఫ్యూచర్ లో సామ్ మరిన్ని హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ఓ సినిమా చేస్తుంది.