మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఈసారి. కేవలం 900 పైచిలుకు ఓట్లున్న అసోసియేషన్ అయినప్పటికీ.. ఈ ఎన్నికలను రెండు తెలుగు రాష్ట్రాల జనాలు ఎంతో ఉత్కంఠతో అనుసరించారు. గత కొన్ని వారాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద టాపిక్ అయి కూర్చుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా వేడి చల్లారడం లేదు. ఫలితాలపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. దీనిపై సోషల్ మీడియా భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది రాజకీయంగానూ చర్చకు దారి తీయడం గమనార్హం. ఈ చర్చలోకి మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా వచ్చారు. ప్రకాష్ రాజ్ రాజీనామా నేపథ్యంలో ఆయన ఫేస్ బుక్‌లో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. అందులో ఆయనేమన్నారంటే..
Dear Prakash Raj గారు, ఇప్పుడే చూసాను మీరు “మా” సభ్యత్వం నుండి వైతొలుగుతున్నారని. కానీ అది మంచి నిర్ణయం కాదు. మీరు నెగ్గాలని ఒక్క హిందూ మతోన్మాదులు తప్ప సామాన్య ప్రజానీకం అందరూ కోరుకున్నారు. తమ ప్రభావం తగ్గలేదు అని చెప్పటానికి పరిశ్రమ మా చేతుల్లోనే ఉంది అని చెప్పడానికి కమ్మ వర్గము అంతా కలిసిపోయింది. మెగా ఫామిలీని కాపులను అదుపులో ఉంచాలని అధికారంలో ఉన్న రెడ్డి వర్గము వారినే సపోర్ట్ చేసింది. ప్రకాశ్ రాజ్ vs ANR, NTR, Krishna,daggupati, manchu…ఫామిలీస్. chandrababu, jagan mohan reddy and BJP.
ఇది మీ గెలుపే…ప్రజల దృష్టిలో మీరే నెగ్గారు. ఇన్ని శక్తులను తట్టుకొని మీకు ఓటు వేసిన వాళ్ళను, డబ్బును కూడా తట్టుకొని వేసిన వాళ్ళను బయటనుంచి నైతికంగా ఎంతో సపోర్ట్ చేసిన ప్రజల గురించి మీ నిర్ణయాన్ని పున సమీక్షించుకోండి.. అని హర్షకుమార్ పేర్కొన్నారు. ఈ పోస్టు పెట్టిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామాపై వివరణ ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్ చూశాక తన పోస్టును ఎడిట్ చేసి అదనంగా ఒక వ్యాఖ్య జోడించారు హర్షకుమార్.. అందులో ఆయన.. మీ పూర్తి ప్రెస్ మీట్ చూసాక మీ నిర్ణయం సహేతుకమైనదే అని అనిపించింది అని పేర్కొనడం విశేషం.
This post was last modified on October 11, 2021 9:05 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…