Movie News

‘అఖండ’ టీంలో కరోనా టెన్షన్


ఇండియా అంతటా కరోనా వార్తలు బాగా తగ్గిపోయాయి. ముందు వేసిన అంచనాల ప్రకారం అక్టోబరులో థర్డ్ వేవ్ దేశాన్ని ఊపేస్తూ ఉండాలి. కానీ ఆ ప్రమాదం తప్పినట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది తప్ప పెరగట్లేదు. అలాగని కరోనా కథ ముగిసిందని మాత్రం అనుకోలేం. ఓ మోస్తరుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఈ మధ్య ప్రముఖులెవ్వరూ వైరస్ బారిన పడ్డట్లు వార్తలు రాలేదు. సినిమా ఈవెంట్లు చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. సినిమాలు జోరుగా రిలీజవుతున్నాయి.

ఇలాంటి టైంలో ప్రముఖ కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ కరోనా బారిన పడటం ఆమె నటిస్తున్న ‘అఖండ’ చిత్ర బృందాన్ని కంగారు పెట్టేసింది. తాను కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ప్రగ్యా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “అంతగా రుచించని వార్తతో ఆదివారం ఉదయం నిద్ర లేచాను. రెండుసార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ.. ఇప్పటికే ఓసారి కరోనా సోకినప్పటికీ.. మళ్లీ నేను కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్త వహిస్తూ ఐసొలేట్ అయ్యాను. గత పది రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అని ప్రగ్యా తన పోస్టులో పేర్కొంది.

గత పది రోజుల్లో ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్నది ‘అఖండ’ టీం సభ్యులే కాబట్టి వాళ్లకు ఆందోళన తప్పదు. గోవాలో కొన్ని రోజుల కిందటే ‘అఖండ’ చివరి షెడ్యూల్ ముగిసింది. ఆ తర్వాత చిత్ర బృందం ముగింపు వేడుకను కూడా చేసుకుంది. ఇందులో హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్లందరూ ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా మీడియాలోకి వచ్చాయి. కాబట్టి అందరూ పరీక్షలు చేయించుకోక తప్పదు. వారిలో ఎవరైనా పాజిటివ్‌గా తేలతారేమో చూడాలి మరి.

This post was last modified on October 10, 2021 8:58 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago