తెలుగు సినిమా దర్శకుల్లో క్రిష్ భిన్నమైన వ్యక్తి. తాను తీసే ప్రతి సినిమా కాస్త డిఫరెంట్ గా ఉండాలని నమ్మే దర్శకుల్లో ఆయన ఒకరు. క్రిష్ కథాంశాలు సగటు మనిషి తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఉంటాయి. ఎంత కష్టమైన కథాంశం అయినా.. ఆసక్తికరంగా ఉండటమే కాదు.. అరటిపండు తోలు ఒలిచి చేతికి ఇచ్చినంత సింఫుల్ గా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సమాజం పెద్దగా ఆలోచించని సాధారణ విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు.
తాజాగా ఆయన తీసిన మూవీ ‘కొండ పొలం’. హిట్ ఫ్లాపు అనే టాపిక్ ను పక్కన పెడితే అడవి.. గొర్రెలు.. వాటిని కాసే గొర్రెల కాపరుల జీవిత నేపథ్యంతో తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోందని చెప్పాలి. సినిమా విడుదల నేపథ్యంలో ఆయనో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ వేళ.. దాదాపు రెండు వేల గొర్రెలతో పని చేసిన ఆయన.. గొర్రెల నుంచి ఏమైనా నేర్చుకున్నారా? అంటే.. గొర్రెల నుంచి కాదు కానీ.. గొర్రెల కాపరుల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఏది ఈతకు వచ్చింది? దేనికి ముల్లు గుచ్చుకుంది? అనేది వాళ్లకు అవగాహన ఉంటుందని.. మన వృత్తిలో మనకెంత నైపుణ్యం ఉందో గొర్రెలు సాకడంలో వారికి అంత నైపుణ్యం ఉంటుంది. ఒక ఫిలిం మేకర్, పొలిటీషియన్‌లానే గొర్రెల కాపరి కష్టం ఎవరికంటే తక్కువ కాదు. అన్ని జీవులను వేసుకొని అడవిలో తిరగడం అంత సులభం కాదన్నారు. గొర్రెలు కాయడం చూసినంత తేలికైన విషయం కాదని, ఎంతో సునిశిత పరిశీలన అవసరమన్న విషయాన్ని క్రిష్ వివరించారు.
This post was last modified on October 10, 2021 8:58 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…