మామూలు రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మారిన ‘మా’ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చేసింది. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు.. .ఘాటు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల హీట్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి వేళలో.. పోలింగ్ వాతావరణం ఎలా ఉంటుందన్న ప్రశ్న అందరిలో భారీ ఆసక్తిని రేపింది. కాసేపటి క్రితం ‘మా’ పోలింగ్ షురూ అయ్యింది.
ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మూడు ప్లటూన్ల బలగాల్ని ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మొహరించటమే కాదు.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల పోలింగ్ కోసం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ను వేదికగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మూడు గదుల్ని కేటాయించి.. ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపును ఈ రోజే పూర్తి చేయనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు విడుదల అవుతాయి.
బ్యాలెట్ పద్దతిలో సాగే పోలింగ్ లో 883 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు సినీతారలు ఉదయాన్నే రావడం మొదలైంది. అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న మంచు విష్ణు మొదటగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రకాశ్ రాజ్ వచ్చారు. రావటంతోనే అక్కడే ఉన్న విష్ణును చూసి.. ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న మోహన్ బాబును చూసి.. వెంటనే ఆయన కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. మోహన్ బాబు అందుకు నో చెప్పి.. ప్రకాశ్ రాజ్ భుజం తట్టిన వైనం అక్కడి వారిని విపరీతంగా ఆకర్షించింది. ఇలాంటి వాతావరణంలో పోలింగ్ ముగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 10, 2021 10:18 am
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…