మామూలుగా ఒక పెద్ద హిట్ మూవీతో పరిచయమైన దర్శకుడు.. ఆ వెంటనే చకచకా తర్వాతి సినిమాలకు సన్నాహాలు చేసుకుంటాడు. రెండో సినిమాను వీలైనంత త్వరగా తీసేస్తుంటాడు. కానీ ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మాత్రం రెండో సినిమాను పట్టాలెక్కించడానికి రెండేళ్లకు పైగానే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం.. తన కథకు తగ్గ హీరోలు దొరక్కపోవడం.
ఈ సినిమాను నాగచైతన్య, రవితేజ లాంటి వాళ్లకు చెప్పినా వాళ్లు ఒప్పుకున్నట్లే ఒప్పుకుని నో చెప్పేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒక హీరో తనకు హ్యాండ్ ఇవ్వడం పట్ల అసహనంతో చీప్ స్టార్ అంటూ ఒక కామెంట్ కూడా చేశాడు అజయ్ అప్పట్లో. ఆ హీరో ఎవరనే విషయంలో కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. ఐతే చివరికి శర్వానంద్, సిద్దార్థ్‌లను హీరోలుగా ఖరారు చేసి సినిమా మొదలుపెట్టాడు. ముగించాడు. అక్టోబరు 14న దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మహాసముద్రం ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందు జరిగిన సంగతులను అజయ్ గుర్తు చేసుకున్నాడు. ఈ కథను తాను చాలామంది హీరోలకు చెప్పానన్నాడు. అజయ్ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే కాబట్టి.. తనీ మాటెత్తగానే ఎవరి మీద ఏం విమర్శలు చేస్తాడో, కౌంటర్లు వేస్తాడో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కానీ అజయ్ వివాదాల జోలికి వెళ్లకుండా పాజిటివ్ కామెంటే చేశాడు. ఇది ఇద్దరు హీరోల కథ కావడంతో కొందరు ఈ చిత్రం చేయడానికి వెనుకంజ వేశారని, సోలో హీరో అయితేనే చేయాలనుకుంటున్నట్లు చెప్పారని.. అలా నో చెప్పిన వాళ్లు కూడా వేరే వాళ్ల దగ్గర మహాసముద్రం కథ గురించి గొప్పగా చెప్పారని అజయ్ అన్నాడు.
ఇక శర్వానంద్, సిద్దార్థ్‌లతో ఈ సినిమా మొదలుపెట్టినపుడు.. వీళ్లను ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాం అంటూ కొందరు వార్నింగ్ ఇచ్చారని.. కానీ ఆ ఇద్దరూ తనకు ఎంతగానో సహకరించి, తానేం చెబితే అది చేశారని అజయ్ తెలిపాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని, ఇది రాసిపెట్టుకోవాలని, పోస్టర్లు కూడా రెడీ చేసుకోవచ్చని అజయ్ ధీమాగా చెప్పడం విశేషం.
This post was last modified on October 10, 2021 10:27 am
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…