మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం టాలీవుడ్లో చిచ్చు పెడుతున్నట్లే కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా విమర్శలు, ఆరోపణలతో ఎన్నికల వ్యవహారం వేడెక్కిపోగా పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లకు మద్దతుగా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కన్నడిగుడు కావడం, గతంలో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇక్కడి నటుల అవకాశాలను దెబ్బ తీశాడని, నిర్మాతలను ఇబ్బంది పెట్టాడని ఉన్న ఆరోపణల దృష్ట్యా ఆయన్ని వ్యతిరేకించే వారంతా మంచు విష్ణుకు మద్దతిస్తున్నారు.
లేదు లేదంటూనే ‘లోకల్-నాన్ లోకల్’ అంశం ఎన్నికల్లో కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రవిబాబు, రాజీవ్ కనకాల లాంటి వాళ్లు పరోక్షంగా ప్రకాష్ రాజ్ స్థానికతను ప్రశ్నిస్తూ మంచు విష్ణుకు మద్దతివ్వడం తెలిసిందే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ విషయంలో కోట శ్రీనివాసరావు లాంటి దిగ్గజం ప్రశ్నలు సంధించారు. ఆయన మంచు విష్ణుకు మద్దతు పలికారు.
ఒక టీవీ ఛానెల్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ అధ్యక్ష బరిలో ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కోట. ప్రకాష్ రాజ్ అహంభావి అనే విషయాన్ని ఆయన లేవదీశారు. నటుడిగా బిజీగా ఉన్న టైంలో ఆయన నిర్మాతలను ఇబ్బంది పెట్టారన్నారు. తాను కూడా జాతీయ స్థాయి ఆర్టిస్టునే అని.. వేరే దేశాలకు వెళ్లినపుడు కూడా తనను గుర్తు పడుతుంటారని.. అలా అని తాను ఎప్పుడూ విర్రవీగలేదని.. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తనకు అన్ని అవార్డులొచ్చాయిని.. ఇంత సాధించానని చెప్పుకుంటూ ఉంటారని కోట అన్నారు. గతంలో తనను ప్రకాష్ రాజ్ తిట్టాడనే కారణంతో తాను ఇప్పుడు ప్రకాష్ రాజ్‌ను వ్యతిరేకించడం లేదని.. వాస్తవం మాట్లాడుతున్నానని ప్రకాష్ రాజ్ అన్నారు.
ప్రకాష్ రాజ్ అయినా, జీవిత అయినా, ఇంకొకరైనా టీవీల ముందుకొచ్చి ఇష్టానుసారం ఆరోపణలు, విమర్శలు చేసి ‘మా’ పరువును ఎందుకు దిగజారుస్తున్నారని కోట అన్నారు. తాను ‘మా’లో కోశాధికారిగా పని చేసినపుడు కూడా కొన్ని వివాదాలు వచ్చాయని.. అప్పుడు నాలుగ్గోడల మధ్య సమస్యను పరిష్కరించుకున్నాం కానీ ఇలా బజారున పడలేదని ఆయనన్నారు. ప్రకాష్ రాజ్‌కు చిరంజీవి మద్దతిస్తున్నారని తెలిసి తాను ఆయనకే ఫోన్ చేసి, అసలెందుకు ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేస్తున్నారని నిలదీసినట్లు కోట వెల్లడించారు. చిరంజీవి అంటే తనకు చాలా గౌరవం ఉందని.. ఐతే ఆయన కుటుంబం నుంచి ఎవరైనా ‘మా’ ఎన్నికల్లో నిలబడితే బాగుండేదని, అలా కాకుండా ప్రకాష్ రాజ్‌కు మద్దతివ్వడం తనకు నచ్చలేదని కోట అన్నారు.
This post was last modified on October 9, 2021 6:22 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…