ప్రభాస్ రెమ్యునరేషన్.. మొత్తం రూ.600 కోట్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఒకదాని తరువాత మరొక సినిమా ప్రకటన అయితే వస్తుంది కానీ ఆ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. సాధారణంగా అయితే ప్రభాస్ ఒక సినిమాను పూర్తి చేసి మరొక సినిమా సెట్స్ పైకి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు తన జోరు పెంచారు. ‘రాధేశ్యామ్’ సినిమా సెట్స్ పై ఉండగానే.. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల షూటింగ్ మొదలుపెట్టారు.

ప్రభాస్ ఇంత వేగంగా ఎందుకు సినిమాలను మొదలుపెడుతున్నారంటే.. ఆయనకి పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమాలను ఫైనలైజ్ చేసి అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకుంటున్నారట. మరో రెండు, మూడు ఏళ్లలో ఆయన అనౌన్స్ చేసిన సినిమాలన్నీ పూర్తి చేయగలిగితే ప్రభాస్ కి మొత్తం రూ.600 కోట్ల రెమ్యునరేషన్ అందుతుంది.

ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ముందుంటారు. ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఈ రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు దాంతో పాటు ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేశారు. ఇది కాకుండా మైత్రితో మరో సినిమా కమిట్ అయ్యారు. ఆ లెక్కన చూసుకుంటే మొత్తం ఈ సినిమాల ద్వారా రూ.600 కోట్లు సంపాదించబోతున్నారన్నమాట!