టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా సెట్టయినా హీరోయిన్‌గా మొదట వినిపించేది పూజా హెగ్డే పేరే. అంతలా క్రేజ్ పెరిగిపోయింది తనకి. రీసెంట్‌గా ఆమె పవన్ కళ్యాణ్‌తో నటిస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అఫీషియల్‌గా ఎవరూ అనౌన్స్ చేయకపోవడంతో రూమరేమో అనుకున్నారంతా. కానీ అది పుకారు కాదు, నిజమేనని ఇప్పుడు కన్‌ఫర్మ్ అయ్యింది.
ఈ నెల 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో కలిసి థియేటర్స్‌లో సందడి చేయబోతోంది పూజ. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పూజ, పవన్‌ల కాంబోని ఖరారు చేశాడు హరీష్ శంకర్. ఈ ఈవెంట్‌లో పూజని చాలా పొగిడేశాడు హరీష్. ‘కరోనా టైమ్లో అందరూ ఖాళీగా ఉన్నారు.. ఒక్కరు తప్ప. తనకి కరోనా లేదు. లాక్‌డౌన్ లేదు. ఎప్పుడు చూసినా పని పని. అంతే. తనెవరో కాదు పూజా హెగ్డే. హీరోయిన్ల డేట్స్ షూటింగ్ కోసం తీసుకుంటూ ఉంటాం. కానీ పూజతో ఫోన్‌లో మాట్లాడ్డానికి కూడా డేట్స్ తీసుకోవాల్సి వస్తోంది’ అన్న హరీష్.. ‘ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది’ అని చెప్పాడు.
ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది పూజ. మహేష్, త్రివిక్రమ్‌ల సినిమాలోనూ తనే హీరోయిన్. ఇప్పుడు హరీష్ కామెంట్స్‌తో పవన్ సినిమా విషయంలో ఉన్న డౌట్ కూడా క్లియరైపోయింది. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్‌సింగ్’లో పవన్‌కి జంటగా పూజయే నటిస్తోందని కన్‌ఫర్మ్ అయ్యింది. ఆల్రెడీ హరీష్ తీసిన డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో ఆమె నటించింది. పైగా పూజ అంటే తనకి ఇష్టమని, తనతో పని చేయడం బాగుంటుందని గతంలో హరీష్ కూడా అన్నాడు. కాబట్టి పవన్ కోసం కూడా ఆమెనే సెలెక్ట్ చేసి ఉంటాడు.
మరోవైపు తమిళంలో విజయ్‌తో ‘బీస్ట్’ మూవీ చేస్తూ అక్కడి స్టార్ హీరోల సినిమాలనూ బ్యాగ్‌లో వేసుకోడానికి రెడీ అయ్యింది పూజ. అటు నార్త్‌లోనూ సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ లాంటి బిగ్ హీరోస్‌తో నటిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఎక్కడ చూసినా పూజ హవానే నడుస్తోంది.
This post was last modified on October 9, 2021 12:04 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…