‘బాహుబలి’తో అనుకోకుండా అన్నీ కలిసొచ్చి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని.. కానీ ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం అంత తేలిక కాదని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అందులోనూ ‘బాహుబలి’ తర్వాతి చిత్రం ‘సాహో’ అంచనాలను అందుకోలేకపోవడం, దాని తర్వాతి సినిమా ‘రాధేశ్యామ్’కు అనుకున్నంత బజ్ రాకపోవడంతో ప్రభాస్ పనైపోయిందని తీసి పడేసిన వాళ్లూ ఉన్నారు. కానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతడికున్న డిమాండ్ ఏంటో తర్వాత అతను సెట్ చేసుకున్న ఒక్కో ప్రాజెక్టును బట్టి అందరికీ అర్థమవుతోంది.
వివిధ ఇండస్ట్రీల నుంచి పేరున్న దర్శకులు, నిర్మాతలు ప్రభాస్ కోసం క్యూలు కట్టేస్తున్నారు. అతణ్ని నమ్మి భారీ కథలు, వందల కోట్ల బడ్జెట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే లాంటి మెగా మూవీస్‌ను లైన్లో పెట్టాడు ప్రభాస్. వీటిలో స్థాయి పరంగా ఒకదాన్ని మించిన సినిమా ఇంకోటి.
ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే మరో స్పెషల్ మూవీని ప్రకటించాడు ప్రభాస్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీని మీదా వందల కోట్ల బడ్జెట్ ఉంటుందనడంలో, సాంకేతికంగా ప్రపంచ స్థాయి సినిమాలకు దీటుగా ఇది రూపొందుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్లో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఒకటుంది. ప్రస్తుతం కాస్త పేరున్న సినిమాలన్నింటికీ ‘పాన్ ఇండియా’ ట్యాగ్ వేసేస్తుండటం తెలిసిందే. ఇందులో చాలా వరకు ఒక భాషలో తీసి, ఇతర భాషల్లో అనువాదం చేయడమే ఉంటోంది. చాలా భాషల్లో నామమాత్రంగానే ఆ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
కానీ ప్రభాస్ సినిమాలు మాత్రం ‘ట్రూ పాన్ ఇండియా’ తరహాలో రూపొందుతున్నాయి. దేశ్యాప్తంగా అతడికున్న ఫాలోయింగ్ అలాంటిది. కాగా ‘స్పిరిట్’ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనే కాక మూడు విదేశీ భాషల్లోనూ రూపొందించబోతుండటం విశేషం. అది కూడా చైనీస్, జపనీస్, ఇంకో విదేశీ భాషలో కావడం విశేషం. భారతీయ భాషల్లో సినిమా తీసి.. తర్వాత వీలును బట్టి విదేశీ భాషల్లో అనువాదం చేసి రిలీజ్ చేయడం చూశాం కానీ.. ఇలా ముందే చైనీస్, జపనీస్ భాషల్లో సినిమా తెరకెక్కబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ పోస్టర్లో వెల్లడించడం నభూతో. దీన్ని బట్టి ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on October 8, 2021 10:30 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…