యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మరోసారి తన దూకుడు చూపించాడు. ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసి.. అంతకుమించిన మూడు భారీ చిత్రాలను లైన్లో పెట్టి సమాంతరంగా అందులో రెండు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటూ.. మూడో సినిమా షూటింగ్‌కు కూడా సన్నాహాలు చేసుకుంటున్న ప్రభాస్.. ఇప్పుడు నాలుగో సినిమాను ప్రకటించాడు. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అనదగ్గ 25వ చిత్రాన్ని గురువారమే ప్రభాస్ ప్రకటించాడు.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో, టీ సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సందీప్ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్‌లకు కూడా కూడా నిర్మాణ భాగస్వామ్యం ఉండటం విశేషం. ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్లుంది. 2023లో కానీ ఇది పట్టాలెక్కకపోవచ్చు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ టైటిల్ ఆధారంగా ఈ సినిమా కథేమై ఉంటుంది.. ఎందుకీ టైటిల్ పెట్టారు అనే చర్చలు మొదలైపోయాయి. మామూలుగా అయితే ఈ టైటిల్‌ను చూసే దృష్టికోణం వేరుగా ఉండేది కానీ.. సందీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో అతడి తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ దృష్టికోణంలో దీన్ని చూస్తున్నారు. ‘స్పిరిట్’ అంటే మద్యం కోసం వాడే స్పిరిట్ అయి ఉండొచ్చేమో.. ఇది మద్యం, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథ అయ్యుండొచ్చేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా ఈ సినిమా డార్క్ థీమ్‌తోనే ఉంటుందని.. సందీప్ తన స్టయిల్లో క్రేజీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతాడని అంటున్నారు.
మరోవైపు ‘స్పిరిట్’ అంటే ‘స్ఫూర్తి’ అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి సందీప్ తన శైలికి భిన్నంగా.. ఏదైనా స్ఫూర్తిదాయక, సందేశాత్మక సినిమా ఏమైనా చేయబోతున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ సందీప్ అలాంటి సినిమా చేసే అవకాశం తక్కువే. రాబోయే రోజుల్లో ఈ టైటిల్ గురించి సందీప్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూద్దాం. ప్రస్తుతం అతను రణబీర్ కపూర్ హీరోగా ‘ఎనిమల్’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 7, 2021 2:43 pm
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…