రకుల్ ఇంటికి క్రిష్ వెళ్లినప్పుడు ఏం జరిగింది?

సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను బయటపెట్టడం చాలా అరుదు. అలాంటి ఆసక్తికర విషయాల్ని అప్పుడప్పుడు బయటకు వెల్లడిస్తుంటారు కొందరు నటీనటులు. తాజాగా అలాంటి ఉదంతాన్నే వెల్లడించారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఆమె క్రిష్ దర్శకత్వంలో నటించిన ‘కొండ పొలం’ మూవీ ఈ వారం విడుదల కానుంది. ఈ సినిమాలో గొర్రెలు కాసే అమ్మాయిగా రకుల్ కనిపించనుంది.

ఈ సినిమా కథ చెప్పేందుకు తన ఇంటికి దర్శకుడు క్రిష్ వచ్చినప్పుడు తాను షార్ట్.. టీషర్ట్ లో ఉన్నట్లు చెప్పారు. తనను చూసినంతనే ‘యంగ్ గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్ కాంప్లిమెంట్ ఇచ్చినట్లుగా రకుల్ చెప్పింది. తాను ఇంకా యంగ్ అనే మెసేజ్ ను చాలా తెలివిగా పరిశ్రమకు చెప్పడానికి ముప్ఫై ఏళ్ల రకుల్ చేసిన ప్రయత్నం బాగుంది.

ఇప్పటికే పలువురు సీనియర్ హీరోలతో నటించిన ఆమె.. తాను యంగ్ హీరోలతో చేయడానికి సరిగ్గా సూట్ అవుతానన్న విషయాన్ని మంచి టైమింగ్ తో చెప్పింది. తనకెంత క్లిష్టమైన టాస్కు ఇచ్చినా.. చేసేస్తానని చెబుతోంది. ఈ సందర్భంగా కొండపొలం ఎదురైన ఓ ఆసక్తికరమైన ఘటనను వివరించింది.

ఈ సినిమాలో రకుల్ ది గొర్రెలు కాసే అమ్మాయి పాత్ర అని తెలిసిందే. మరి ఆ పాత్ర అంత సులువు కాదు కదా. గొర్రెల్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. ఆ క్రమంలో షూటింగ్ లో గొర్రెల్ని కంట్రోల్ చేయటం కష్టమైందని చెప్పుకొచ్చారు. కానీ తాను.. వైష్ణవ్ తేజ్ కలిసి నాలుగు రోజులకే గొర్రెల్ని కంట్రోల్ చేయటం నేర్చుకున్నట్లు చెప్పింది.

మొత్తానికి రోటీన్ సినిమాలకు భిన్నంగా కొండపొలం సినిమాలో రకుల్ ఎక్కువగా కష్టపడిందన్నట్లుగా ఆమె మాటలు ఉన్నాయి. మరి..ఆ కష్టం ఎంతో తెర మీద కనిపించనుంది.