అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారంపై చర్చ ఎంతకీ ఆగట్లేదు. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చే వరకు విడాకుల గురించి ఎన్నెన్ని ఊహాగానాలు వచ్చాయో తెలిసిందే. ఈ విషయం నిజమా కాదా అనే విషయంలో ఎడతెగని చర్చ జరిగింది. చివరికి తాము విడిపోతున్న విషయాన్ని చైతూ, సమంత అధికారికంగా ప్రకటించారు కొన్ని రోజుల ముందే.
ఇక అప్పట్నుంచి అసలు వీళ్లు విడిపోవడానికి కారణాలేంటి అనే దానిపై విపరీతమైన డిస్కషన్ నడుస్తోంది. ఇద్దరిలో ఎవరిది తప్పు.. ఎవరు ఎవరిని కాదనుకున్నారు.. ప్రస్తుతం ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు.. భరణం సంగతేంటి అనే దానిపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ టైంలో చైతూ తన స్టయిల్లో మౌనం వహిస్తుంటే.. సమంత మాత్రం నర్మగర్భపు సోషల్ మీడియా పోస్టులతో జనాల్లో రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తోంది.
మరోవైపు సమంత పర్సనల్ స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ జుకాల్కర్ కొన్ని రోజులుగా పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు సైతం చర్చనీయాంశం అవుతున్నాయి. చైతూతో విడిపోవడంలో ఆమె తప్పేమీ లేదన్నట్లు.. ఆమె బాధితురాలు అన్నట్లుగా అతడి పోస్టులు ఉంటున్నాయి. ఎక్కడా ఎవరి పేర్లూ వాడకపోయినా.. సమంతకు ఏదో అన్యాయం జరిగింది అనేట్లుగా ఆయన పోస్టులు ఉంటున్నాయి. తాజాగా అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఇందులో ప్రీతమ్.. “తమ ఇళ్లలోని మగవాళ్ల నిజ స్వరూపం బయటికి తెలియకుండా దాచే వాళ్లే.. మహిళలపై జరిగే హింసకు బాధ్యులు”.. “అందులోనూ పలుకుబడి ఉన్న కుటుంబాలు దీనికి మరింత కారణమవుతాయి. ఈ రోజుల్లో హింస అనేది మానసిక వేధింపులు, విమర్శల రూపంలోనూ ఉంటోంది” అంటూ రెండు కోట్స్ పెట్టాడు. ఇది అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన కోట్స్ అని, సమంతకు అన్యాయం జరిగిందని అతను చెప్పదలుచుకున్నట్లుగా ఉందని నెటిజన్లు సూత్రీకరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates